Amit Shah: వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే.. అమిత్‌ షా సంచలన హామీ

టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే టీఎంసీ సర్కార్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే  45 రోజుల్లోనే రాష్ట్రంలో సరిహద్దు కంచె వేస్తామన్నారు.

New Update
Amit shah

Amit shah

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే టీఎంసీ సర్కార్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేయడం, అలాగే సరిహద్దు భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని మండిపడ్డారు. 

Also Read: రేపే బడ్జెట్.. గ్యాస్, సిగరేట్స్ నుంచి ఫాస్టాగ్ వరకు.. రేపటి నుంచి ఈ ధరల్లో మార్పు?

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్యారక్‌పుర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే  45 రోజుల్లోనే రాష్ట్రంలో సరిహద్దు కంచె వేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న చొరబాట్లు దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారినట్లు పేర్కొన్నారు. 

కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా బార్డర్‌ ఫెన్సింగ్‌ కోసం మమతా ప్రభుత్వం BSFకు భూమిని కేటాయించడం లేదంటూ ధ్వజమెత్తారు. చొరబాటుదారులను టీఎంసీ ఓటు బ్యాంకుగా చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులు, అధికారులు సైతం అక్రమ వలసలను అడ్డుకోవడం లేదన్నారు. ఫేక్‌ డాక్యుమెంట్లతో చొరబాటుదారులు దేశమంతా వెళ్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రత కోసం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఎంతో ముఖ్యమని అన్నారు. 

Also Read: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర.. ఆమె పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు