మొబైల్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఓటీటీలకు ప్రాధాత్యత పెరిగి టీవీలు చూస్తున్నవారి సంఖ్య తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. Bi TV అనే మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024 సందర్భంగా ఆవిష్కరించబడిన BSNL ఏడు కొత్త సర్వీస్ల్‌ల్లో BiTV కూడా ఒకటి. దీని ద్వారా 300 ఛానల్స్‌ను ఉచితంగా యాప్ వినియోగదారులకు అందించనుంది. బీఎస్ఎన్ఎల్ BiTV అందుబాటులోకి వస్తే డీటీహెచ్‌లకు రీఛార్జ్ చేసుకునే పని అవసరం లేదు. ఫ్రీగా 300 టీవీ ఛానల్స్, వెబ్ సిరీస్, మూవీస్ ఎంజాయ్ చేయవచ్చు. ఇది కూడా చదవండి: Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్! సెంట్రల్ గవర్నమెంట్ నెట్‌వర్క్ నుంచి 300 ఛానల్స్‌తో ఫ్రీ ఓటీటీ వస్తోందంటే బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే BiTV సర్వీస్ పుదుచ్చేరిలో ప్రారంభించబడింది. త్వరలోనే దేశ మొత్తం ఈ ఫ్రీ ఓటీటీను తీసుకురానున్నట్లు అఫీషియల్ ఎక్స్ హ్యాండీల్‌లో ప్రకటించింది. టీవీ లైవ్ ఛానల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ వంటివి ఫ్రీగా చూడవచ్చు. 300 ఛానల్స్ ఇందులో స్ట్రీమింగ్ అవుతుంటాయి. బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగిస్తున్నవారు BiTV యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ టూ మొబైల్ సర్వీస్ మోడల్‌లో ఈ ఫ్రీ ఓటీటీ ప్రసారం చేయనున్నారు. ఈ సర్వీస్‌లో DTH ప్రొవైడర్లకు BSNL గట్టి పోటీ ఇవ్వనుంది. వీటిలో ఫైబర్ బేసడ్ ఇంట్రానెట్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి : టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షపై కీలక అప్‌డేట్!