/rtv/media/media_files/2025/11/10/fotojet-9congress-top-brass-denies-time-to-siddaramaiah-during-delhi-visit-2025-11-10-16-22-38.jpg)
Congress top brass denies time to Siddaramaiah during Delhi visit
Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పుపై వివాదం కొనసాగుతూనే ఉంది. నవంబర్ చివరి నాటికి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో సీఎం మార్పు అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం సిద్ధరామయ్యాకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాకిచ్చింది. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యేందకు సమయం ఇవ్వాలని కోరగా దీనికి హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం.
Also Read: భార్యను చంపిన భర్త...దృశ్యం సినిమా స్పూర్తితో మాస్టర్ ప్లాన్
నవంబర్ 15న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ క్రమంలోనే అక్కడ సీనియర్ నేతలను కలిసిందుకు అనుమతి కోరగా.. హైకమాండ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలతో భేటీ అవసరం లేదని ఆయనకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సిద్ధరామయ్య వర్గంలో ఉన్న ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్.. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు.
Also Read: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌పై వివాదం! తెలుగు మీడియా కెమెరాలకు నో ఎంట్రీ!
అతడి సోదరుడు కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ నివాసంలో జరిగిన ఈ భేటీ బల ప్రదర్శన కోసమే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉండగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వారం రోజుల్లోనే ఆయన ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. అయితే ఓట్ చోరీ విషయంలో ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు సమాచారం.
Also Read: బుద్ది మార్చుకొని పాక్.. భారత్ చుట్టూ ఉగ్ర కుట్రలకు ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఇదిలాఉండగా.. కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సీఎం అధిష్ఠానంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. చివరికి సీనియార్టీని పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ సిద్ధరామయ్యకు సీఎం బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం నడిచింది. ఇటీవల ఓ ఎమ్మెల్యే మరికొన్ని రోజుల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని చెప్పడం రాజకీయంగా దుమారం రేపింది. అప్పటి నుంచి కర్ణాటకలో సీఎం మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సిద్ధరామయ్య కూడా తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని తేల్చిచెప్పారు.
Also Read: యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల్లో ఆ గేయాన్ని పాడాల్సిందే
Follow Us