/rtv/media/media_files/2025/11/10/pakistan-2025-11-10-13-48-14.jpg)
Pakistan Relocating Terror Bases To Bangladesh, Nepal With Turkish Help
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పినా దాని తీరు మారలేదు. అయితే పాకిస్థాన్ మళ్లీ ఉగ్ర కుట్రలకు ప్లాన్ వేస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. దీనికోసం నేపాల్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర నివాసాలు, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్-బంగ్లాదేశ్, భారత్-నేపాల్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: టెర్రరిస్టులుగా మారిన డాక్టర్లు.. మెడికల్ కాలేజీలో తుపాకులు, బాంబులు!!
ఉగ్రవాద శిక్షణ పొందేవాళ్ల కోసం బంగ్లాదేశ్, నేపాల్‌లో పలు ప్రాంతాల్లో కొత్త ట్రైనింగ్ సెంటర్లు, నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇటీవల బంగ్లాదేశ్, నేపాల్‌కు సమీపంలో ఉన్న భారత్‌కు చెందిన రాష్ట్రా్ల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. వాళ్లను దర్యాప్తు చేయగా ఈ విషయాలు బయటపడినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు చెప్పాయి. అంతేకాదు పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పాటుచేస్తున్న పలు ప్రాజెక్టులపై కూడా నిఘా ఉంచినట్లు వెల్లడించాయి.
Also Read: అబ్బాయిలతో సంబంధాలు.. కూతురు గొంతు కోసి చంపిన తల్లిదండ్రులు
నేపాల్‌లో కూడా లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్.. తమ ఉగ్ర సంస్థలను విస్తరించేందుకు యత్నిస్తున్నాయని పేర్కొన్నాయి. అల్‌ఖైదా, ఐసిస్ గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్‌లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పాయి. ఇందులో పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్, నేపాల్‌కు నిరంతరం వలసలు కొనసాగుతున్నాయని తెలిపాయి. అంతేకాదు తుర్కియే.. ఆయా దేశాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్వహణ కోసం నిధులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఢాకాలో జమాత్ ఇ ఇస్లామీ కార్యాలయం పునరుద్ధణ కోసం తుర్కియే నిఘా సంస్థ నిధులు అందించినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నాయి.
Follow Us