హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

నేటి నుంచి ప్రారంభం కానున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌‌ను డిసెంబర్ 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే ఈ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

New Update
Hyderabad Book Fair: ఫిబ్రవరి 9 నుంచి పుస్తక ప్రదర్శన..

తెలంగాణలో నేటి నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌(హెచ్‌బీఎఫ్‌) ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్‌ స్టేడియంలో గురువారం(19) అనగా నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ బుక్ ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. ఈ 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌(హెచ్‌బీఎఫ్‌)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు డా.యాకూబ్‌ షేక్‌ తెలిపారు.

ఇది కూడా చూడండి: 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత నిర్వాకం!?

సుమారుగా 350 స్టాళ్లలను ఏర్పాటు చేసి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుక్‌ ఫెయిర్‌లో సుమారుగా 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎందరో ప్రచురణకర్తలు ఉన్నారు. అందులో 210 మందికిపైగా ఉన్నవారి పుస్తకాలను ఈ బుక్ ఫెయిర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ బుక్ ఫెయిర్‌ను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కోటేల వంటి వారి సలహాతోనే కమిటీ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు.

ఇది కూడా చూడండి: బ్లాక్ చీరలో హాట్ బాంబ్‌లా రష్మిక.. నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ!

బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌గా నామకరణం చేశామన్నారు. తెలంగాణ రుచులతో ఫుడ్‌ స్టాళ్లు ఉండటంతో పాటు పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిభిరాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్‌ను చూడవచ్చు.

ఇది కూడా చూడండి: నాకు ఆ టైమ్ వచ్చింది.. డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ ఎమోషనల్!

దీంతో పాటు బుక్‌ ఫెయిర్‌లో ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు అధ్యక్షుడు తెలిపారు. బుక్‌ ఫెయిర్‌కి వచ్చే సందర్శకులకు టికెట్లతో పాటు పుస్తకాల కోసం ఓ సంచిని కూడా ఇవ్వనున్నట్లు అన్నారు. అలాగే విద్యార్థులు వారి ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: చిలుకను పట్టిస్తే రూ.1 లక్ష.. ఆఫర్ అదిరింది గురూ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు