టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బలగం సినిమా ద్వారా గుర్తింపు పొందిన జానపద కళాకారుడు మొగిలయ్య ఈ రోజు వేకువజామున మరణించారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అతను వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

New Update
Balagam Actor Mogalayya

Balagam Actor Mogalayya

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బలగం సినిమా ద్వారా గుర్తింపు పొందిన జానపద కళాకారుడు మొగిలయ్య అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి మొగిలయ్య కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఫలితం లేకపోయింది.

ఇది కూడా చూడండి: 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత నిర్వాకం!?

ఆరోగ్యం తీవ్రంగా విషమించి

కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఈ రోజు తెల్లవారు జామున ఆసుపత్రిలో మరణించారు. మొగిలయ్యకు బలగం సినిమా డైరెక్టర్ వేణు మాత్రమే కాకుండా చిత్రయూనిట్ కూడా చికిత్స కోసం ఆర్థిక సాయం కూడా అందించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మొగిలయ్యకు సాయం అందించారట. మొగిలయ్యకు రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో వైద్యులు వారానికి రెండు సార్లు డయాలసిస్ చేశారు. ఇలా  చేయడం వల్ల ఆయనకు గుండె సమస్యలు కూడా వచ్చాయని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: బ్లాక్ చీరలో హాట్ బాంబ్‌లా రష్మిక.. నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ!

ఇది కూడా చూడండి: నాకు ఆ టైమ్ వచ్చింది.. డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ ఎమోషనల్!

వరంగల్ జిల్లా నర్సంపేటలోని దుగ్గొండి గ్రామంలో మొగిలయ్య జన్మించారు. బుర్ర కథలు చెప్పుకుంటూ మొగిలయ్య జీవనం సాగించేవారు. ఇది వాళ్ల పూర్వీకుల సంప్రదాయమని దీన్నే వృత్తిగా కొనసాగించారు. ఇలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. ఇలా బలగం సినిమాలో అవకాశం వచ్చింది. మొగిలయ్య దంపతులు సినిమా చివరిలో పాట పాడారు. ఇది మంచి హిట్ కావడంతో పాటు గుర్తింపు కూడా లభించింది.  

ఇది కూడా చూడండి: చిలుకను పట్టిస్తే రూ.1 లక్ష.. ఆఫర్ అదిరింది గురూ..!

Advertisment
తాజా కథనాలు