/rtv/media/media_files/2024/11/20/6hJofzzbNL35n1W32Xcv.jpg)
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో 45 ఇప్పటిదాకా 45 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం రెండు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. ఎగ్జిట్ పోల్స్ చర్చలపై తాము టీవీ డిబేట్‌లలో ఎక్కడా కూడా పాల్గొనడం లేదని పార్టీ సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: ఆ పార్టీకి ఓటేయమని చెప్పినందుకు దళిత యువతి హత్య !
Exit Poll TV Debates Today
ఇదిలా ఉండగా మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో పోలింగ్ సందడి నెలకొంది. మహారాష్ట్రలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా. ఝార్ఖండ్‌లో రెండో దశతో ఎన్నికలు పూర్తికానున్నాయి. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటేసి.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఓటర్లకు సూచిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ - జెనీలియా, రకుల్‌ప్రీత్ సింగ్ దంపతులు, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్, శ్రద్ధాకపూర్, సంగతీ దర్శకడు శంకర్ మహదేవన్, అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read: శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే!
మహారాష్ట్రలో ముంబయి, నాగ్‌పూర్, పుణె వంటి నగరాల్లో అత్యధిక ఓటర్లు ఉన్నాకూడా అక్కడి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా 62-64 పట్టణ నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. మరికాసేపట్లో పోలింగ్ పూర్తి కానుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కానున్నాయి. ఇక నవంబర్ 23న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఇరు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!
Also Read : అప్పటి వరకు చంద్రబాబే సీఎం.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన