శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే!

శృంగారం కోసం 'లవ్‌లోర్న్ జానీ' అనే మగపులి 300 కి.మీ ప్రయాణించింది. సహచరికోసం మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నడుచుకుంటూ వచ్చింది. ఇవి 100 కి.మీ దూరం నుంచి ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను గుర్తించగలవని అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు.

New Update
eerrr

Tiger: సహచరితో శృంగారం చేసేందుకు ఓ మగపులి 300 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణించిన సంఘటన ఆశ్చర్య కలిగిస్తోంది. ఈ మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని కిన్‌వాట్ తాలూకా అడవికి చెందిన 'లవ్‌లోర్న్ జానీ' అనే మగపులి రతిలో పాల్గొనేందుకు సహచరిని వెతుకుతూ ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ వచ్చినట్లు అటవిశాఖ అధికారులు తెలిపారు. మగ పులులు తరచుగా చలికాలంలో ఇలాంటి సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభిస్తాయి. ఇది సంభోగం కాలం కావడంతో సహచరిని వెతుకుతూ ఎంతదూరమైన వెళతాయని ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ చెప్పారు.  

అక్టోబర్ మూడో వారంలో ప్రయాణం మొదలు..

ఇందులో భాగంగానే 'లవ్‌లోర్న్ జానీ' అక్టోబర్ మూడో వారంలో తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు అటవీ అధికారులు తెలిపారు. తొలుత ఆదిలాబాద్‌లోని బోథ్‌ మండల అడవుల్లో కనిపించిన ఈ పులి నిర్మల్‌ జిల్లాలోని కుంటాల, సారంగాపూర్‌, మామడ, పెంబి మండలాల మీదుగా ఉట్నూర్‌లోకి ప్రవేశించింది. పులి హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ ఎన్‌హెచ్‌-44 రహదారిని దాటుకుని తిర్యాణి ప్రాంతం వైపు మళ్లినట్లు అటవీశాఖాధికారులు వెల్లడించారు. 

Also Read: విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా.. విడాకులు పై నోరు విప్పిన రెహమాన్‌!

Also Read: AP :ఏపీలో రూ.99కే మద్యం..మందుబాబులకు ఇక పండగే పండగ!

100 కి.మీ దూరం నుంచి వాసన.. 

'మగ పులులు 100 కి.మీ దూరం నుండి ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను గుర్తించగలవు. పులులు ఆహారం కోసం ఓపికగా వేచి ఉంటాయి. కొత్త భూభాగాలకోసం చాలా దూరం ప్రయాణించగలవు. అక్కడ ప్రతి చలికాలంతో చాలా కుటుంబాలను ఏర్పరుస్తాయి. పిల్లలకు ఆ భూభాగాలను వదిలివేస్తాయి. జానీ ప్రయాణంలో కేవలం ప్రేమ మాత్రమే లేదు. అది ప్రయాణంలో ఐదు పశువులను చంపింది. ఆవులను వేటాడేందుకు మూడుసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇటీవల ఉట్నూర్‌లో రోడ్డు దాటుతుండగా కనిపించడంతో నిఘా పెట్టాం. పులులు సహచరుల కోసం వెతకడం వల్ల మనుషులకు ముప్పు ఉండదు. ఇలాంటి సమయంలో పులిని భయపెట్టడం లేదా భయాందోళనలు సృష్టించవద్దని మేము ప్రజలను అభ్యర్థిస్తున్నాం' అని అటవీఅని ప్రశాంత్ బాజీరావు అన్నారు. కవాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లో పులి స్థిరపడే అవకాశం ఉందని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు తెలిపారు. నివాసం ఉండే పులుల జనాభాను నిలబెట్టడంలో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. 

Also Read: Telangana: పంజా విసురుతున్న చలి పులి...దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Also Read: Soudi: రాజద్రోహం, అత్యాచారం నేరాల కింద సౌదీలో ఈ ఏడాది 214 మంది ఉరి!

Advertisment
తాజా కథనాలు