Chopper Crash: గుజరాత్‌లోని పోర్ బందర్ తీరంలో తీర రక్షక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది(Coast Guard helicopter crash Gujarat). ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీళ్లలో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కాసేపటికే టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దీంతో అది కుప్పకూలింది. ఇప్పటికే దీనిపై కోస్ట్‌గార్డు విచారణ చేపట్టింది. Also Read: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్! ఈ హెలికాఫ్టర్ ప్రయాణం మొదలుపెట్టాక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది కూలిపోయింది. దీనిపై కోస్టు గార్డు ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఇదిలాఉండగా.. ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లలో కీలకమైన రక్షణ చర్యలను హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ చేపట్టింది. గతంలో కూడా ఇలాంటి హెలికాఫ్టర్‌లు ప్రమాదాలకు(Chopper Crash) గురయ్యాయి. అయితే వీటిలో డిజైన్ సమస్యలు ఉండటం వల్ల చాలాచోట్ల వీటిని వాడటం లేదు. Also Read: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! 2024 మార్చి 8న ఏఎల్‌హెచ్ ధ్రువ్ ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. ఇందులో ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ఆ హెలికాప్టర్ సేవలను త్రివిధ దళాల్లో నిలిపివేశారు. కొంత కాలం తర్వాత మళ్లీ ఈ సేవలు పునరుద్ధరించారు. కానీ మళ్లీ మరో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో అది కుప్పకూలింది. జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడ పబ్బల్ల అనిల్ (29) ప్రాణాలు కోల్పోయారు. Porbandar - Helicopter crashes at Porbandar Coast Guard Airport, all taken to Civil Hospital, 3 death#gujarat #porbandar #coastguard pic.twitter.com/cH3xn167NG — Indian Observer (@ag_Journalist) January 5, 2025 Also Read: అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ నేతలు ప్రమాణ స్వీకారం Also Read: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!