Santranti Spl Trains: సంక్రాంతి పండుగకు ఏపీ ప్రజలు వెళ్లాలని అనుకుంటారు. కానీ రైలు, బస్సులు అన్ని రద్దీగా ఉండటం వల్ల ప్రయాణ సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతూళ్లకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 52 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైలు లిస్ట్‌ను విడుదల చేసింది. జనవరి 6వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ఆయా ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు వేశారు. ఎక్కువగా తిరుపతి, కాకినాడ టౌన్ వరకు రైళ్లను నడుపుతున్నాయి. ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq — South Central Railway (@SCRailwayIndia) January 5, 2025 ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! అదనపు ఛార్జీలు.. ఇదిలా ఉండగా ఇటీవల 90 రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను నడుపుతున్నారు. గతేడాది సంక్రాంతికి 70 ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈ ఏడాది వీటి సంఖ్యను పెంచారు. తెలంగాణ నుంచి దాదాపుగా 160 నుంచి 170 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సమాచారం. మరి ఇంకా రైళ్ల సంఖ్యను పెంచుతారనే తెలుస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు సాధారణ రైళ్లతో పోలిస్తే అదనంగా ఉంటాయని చెప్పారు. స్పెషల్ ట్రైన్స్ అనేవి అదనపు రద్దీ కొరకే నడుపుతున్నందున కొద్ది మొత్తంలోనే అదనపు ఛార్జీలుంటాయి. ప్రత్యేక రైళ్లు కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్లలానే ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి. ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్! ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు