BIG BREAKING: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!

సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బీహార్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తమ్ముడు,  సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

New Update
cmr college

cmr college cmr college Photograph: (cmr college )

తెలంగాణలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.  ఈ కేసులో బీహార్‌కు చెందిన నంద కిశోర్‌, గోవింద్‌ కుమార్‌‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ్ముడు,  సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డితో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. U/s 77, 125,49,239 BNS సెక్షన్ 11,12, r/w 16,17 పొక్సో కింద కేసులు నమోదు చేశారు.

 A1- నంద కిషోర్ కుమార్ , A2- గోవింద్ కుమార్ లను ఎఫ్ఐఆర్ లో చేర్చిన పోలీసులు... చామకూరి గోపాల్ రెడ్డిని A7 గా,  A6 గా కాలేజ్ డైరెక్టర్ మద్ది రెడ్డి జగన్ రెడ్డి , A5 గా ప్రిన్సిపాల్ అనిత నారాయణలపై  కేసు నమోదు చేశారు.  ఇక A3, A4 లుగా హాస్టల్ వార్డెన్స్ అల్లం ప్రీతీ రెడ్డి, ధనలక్ష్మి లపై కేసు నమోదు చేశారు. నంద కిశోర్‌, గోవింద్‌ కుమార్‌‌లు అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌ల్లో తొంగిచూసినట్లుగా పోలీసులు గుర్తించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్

జనవరి 02వ తేదీన హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో  ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది.  తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపణలు చేస్తూ అందోళనకు దిగగా.. వీరికి ABVP, SFI వంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మద్దుతుగా నిలిచాయి.  దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం  వార్డెన్ ప్రీతి రెడ్డిని సస్పెండ్ చేసింది.  

మరోవైపు ఈ ఘటనను  తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఛైర్‌పర్సన్ శారద సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. దీనిపై వేగంగా దర్యాప్తు చేయాలని, వీలైనంత త్వరగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.  

Also Read :  బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్

Advertisment
తాజా కథనాలు