Bihar: వచ్చే 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు.. సీఎం నితీష్ సంచలన ప్రకటన

సీఎం నితీశ్ కుమార్‌ ఎక్స్‌లో సంచలన ప్రకటన చేశారు. 2025-30 మధ్యకాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. ఇది దాదాపు పూర్తయిందని తెలిపారు.

New Update
CM Nitish Kumar

CM Nitish Kumar

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారం కోసం అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొత్త కొత్త హామీలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్‌ ఎక్స్‌లో సంచలన ప్రకటన చేశారు. 2025-30 మధ్యకాలంలో కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. ఇది దాదాపు పూర్తయిందని తెలిపారు. 

Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

గత ఐదేళ్లలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. ప్రైవేటు రంగంలో మరో 39 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి రెట్టింపు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా ఉద్యోగాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.   

Also Read: భారత్‌ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు

ఇదిలాఉండగా ఇటీవల నితీశ్‌ కుమార్‌ మరో సంచలన హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని పోస్టులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు