/rtv/media/media_files/2025/10/08/cm-mamata-banerjee-2025-10-08-20-13-08.jpg)
CM Mamata Banerjee calls Amit Shah 'acting PM'
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే దేశ ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తర బెంగాల్‌లో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ బుధవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కోల్‌కతాకు చేరుకున్న దీదీ ఎయిర్‌పోర్టు బయట మీడియాతో మాట్లాడారు.
Also Read: కశ్మీర్‌లో సైనికులు మిస్సింగ్.. ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
ఈ క్రమంలోనే అమిత్ షాను యాక్టింగ్ పీఎం అని అన్నారు. అంతేకాదు ఆయన్ని.. ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను మోసం చేసిన 18వ శతాబ్దపు బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్‌తో కూడా పోల్చి విమర్శించారు. '' అమిత్ షా ప్రధాన మంత్రిలా వ్యవహరిస్తున్నారు. మోదీకి అన్నీ తెలుసు. ఈ విషయం చెప్పేందుకు నేను విచారిస్తున్నాను. అమిత్ షాను గుడ్డిగా నమ్మకూడదని ఆయనకు నేను అభ్యర్థిస్తున్నాను. ఏదో ఒకరోదు మీర్ జాఫర్ లాగే మీకు కూడా అమిత్ షా వ్యతిరేకంగా మారుతాడు. జాగ్రత్త'' అంటూ మమతా బెనర్జీ అన్నారు. అలాగే ఎన్నికల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అమిత్ షా ప్రభావంతోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందన్నారు.
Also Read: శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు.. రూ.60 కోట్లు చెల్లించాలని ఆదేశాలు
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోంది. మరికొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6, 11న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ, అమిత్ షా పై దీదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: స్నానం చేస్తూ.. మైనర్ విద్యార్ధికి బట్టలు లేకుండా టీచర్ వీడియో కాల్
Follow Us