/rtv/media/media_files/2025/10/08/krystal-sims-2025-10-08-14-47-38.jpg)
గౌరవమైన వృత్తిలో ఉండి.. విద్యా బుద్దులు నేర్పాల్సిన టీచర్ కీచక పనులకు దిగజారింది. మైనర్ విద్యార్థితో 30ఏళ్ల మహిళా టీచర్ లైంగిక సంబంధం పెట్టుకోడానికి ప్రయత్నించింది. ఈ షాకింగ్ ఘటనలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ విద్యార్ధికి టీచర్ న్యూడ్ వీడియో కాల్స్ చేసిన రికార్డింగ్స్ బాధిత విద్యార్ధి ఫోన్లో పోలీసులకు దొరికాయి. ఈ సంఘటన అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 30 ఏళ్ల ఉపాధ్యాయురాలు క్రిస్టల్ సిమ్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Krystal Sims, 30, Barren County substitute teacher, is facing charges for alleged sexual misconduct involving an underage student.
— Orietta Rose 🇺🇲 (@0riettaRose) October 8, 2025
She allegedly communicated with a male juvenile for the purpose of meeting to have sex.
Kentucky
The student told the deputy that he met Sims… pic.twitter.com/OeNTXvGbp0
వివరాల్లోకి వెళ్తే, పాఠశాలలో సబ్స్టిట్యూట్ టీచర్‌గా పనిచేసిన క్రిస్టల్ సిమ్స్, ఆమె విద్యార్థి అయిన మైనర్ బాలుడితో సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకుంది. ఆగస్టు నెలలో వీరు స్నాప్‌చాట్ ద్వారా కలుసుకొని, ఆన్‌లైన్‌లో చాట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ పర్సనల్‌గా కలుసుకోడానికి ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ సంభాషణలకు సంబంధించిన ఫోన్ కాల్‌ను ఆ విద్యార్థి రహస్యంగా రికార్డ్ చేశాడు. ఈ రికార్డింగ్‌లో ఇద్దరూ లైంగికంగా కలుసుకోడానికి చర్చించుకున్నారు. అంతేకాదు టీచర్ స్నానం చేస్తూ ఆ మైనర్ బాలుడికి వీడియో కాల్ చేసేదని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మైనర్ బాలుడు చెప్పాడు. ఈ సమాచారం అక్టోబర్ 2న పోలీసులకు అందడంతో, బారెన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థితో ఫోన్‌లో మాట్లాడింది ఆమే అని టీచర్ సిమ్స్ అంగీకరించింది. అయితే, క్లాస్‌లో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్పించడానికి మాత్రమే తాను కలుద్దామని అన్నానని, వారిద్దరూ ఎప్పుడూ కలవలేదని లేదా శారీరకంగా కలవలేదని ఆమె పోలీసులకు తెలిపింది.
విద్యార్థి ఇచ్చిన ఆధారాలు, వాంగ్మూలం మేరకు అక్టోబర్ 2న పోలీసులు క్రిస్టల్ సిమ్స్‌ను అరెస్ట్ చేశారు. మైనర్‌ను లైంగిక చర్య కోసం సోషల్ మీడియాలో ప్రోత్సహించిన ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే, ఆమెకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.