BANK JOBS: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 750 బ్యాంక్ జాబ్స్‌కు నోటిఫికేషన్!

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, భారత ప్రభుత్వ రంగ సంస్థ, దేశవ్యాప్తంగా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

New Update
BANK JOBS

BANK JOBS

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు: జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, భారత ప్రభుత్వ రంగ సంస్థ, దేశవ్యాప్తంగా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

పోస్టుల సంఖ్య: 750 (JMGS-1లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్)
తెలంగాణలో పోస్టులు: 50 (జనరల్ 22, EWS 7, OBC 4, SC 2, ST 1)
దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 20, దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 04

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్. ప్రభుత్వ రంగ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లో కనీసం 18 నెలల అనుభవం ఉండాలి. ప్రైవేట్, కో-ఆపరేటివ్, పేమెంట్ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలలో పనిచేసిన వారు అనర్హులు.

వయోపరిమితి: కనీస వయస్సు 20, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. ఆగస్టు 2, 1995 కంటే ముందు లేదా ఆగస్టు 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీ, మాజీ సైనికులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధితుల కుటుంబాలకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. దేశంలో 2.5 లక్షల బ్యాంక్ జాబ్స్!

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీలకు రూ. 100.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. మొత్తం 100 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లోనూ క్వాలిఫై అవ్వాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌లకు 40 శాతం, ఇతరులకు 35 శాతం కనీస అర్హత మార్కులు నిర్ణయించబడ్డాయి.

ఫైనల్ ఎంపిక: రాత పరీక్ష (70% వెయిటేజ్), ఇంటర్వ్యూ (30% వెయిటేజ్) మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

భాషా పరీక్ష: దరఖాస్తు చేసిన రాష్ట్రంలోని స్థానిక భాషలో చదవడం, రాయడం, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. 10వ లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో స్థానిక భాష చదివిన అభ్యర్థులకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు punjabandsindbank.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి: నెలకు లక్షకు పైగా జీతంతో ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

Advertisment
తాజా కథనాలు