USA: ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థలపై ఉగ్రవాద ముద్ర..ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముస్లిం బ్రదర్ హుడ్ లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటిని ఉగ్రవాద సంస్థలుగా ముద్ర వేస్తామని హెచ్చరించారు. లెబనాన్‌, ఈజిప్టు, జోర్డాన్‌ వంటి ముస్లిం బ్రదర్‌హుడ్‌ చర్యలు అమలు కానున్నాయి.

New Update
trumpedu

trumpedu

అరబ్ ప్రపంచంలోని అత్యంత పాతవి, ప్రబావంతమైన ఉద్యమం...అమెరికాలో ఆంక్షల పరిధిలోకి రానుంది. దీనంతటికీ కారణం ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థలపై చర్యలను చేపట్టాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం. వైట్ హౌస్ చెప్పిన ప్రకారం లెబనాన్‌, ఈజిప్టు, జోర్డాన్‌ వంటి ముస్లిం బ్రదర్‌హుడ్‌సంస్థలపై చర్యలు తీసుకునేవిధంగా నివేదిక సమర్పించాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. నివేదిక అందిన 45 రజుల్లోపునే ఆ సంస్థలపై ఎలాంటి ము్ర వేయాలో నిర్ణయిస్తారు. ఆ దేశాలలోని ముస్లిం బ్రదర్‌హుడ్‌ అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్‌, యూఎస్‌ భాగస్వాములపై హింసాత్మక దాడులకు మద్దతివ్వడం, ప్రోత్సహించడం వంటివి చేస్తున్నాయని ట్రంప్‌ పరిపాలన ఆరోపించింది. ఈ సంస్థలననీ హమాస కు మద్దు ఇవ్వడం వల్లనే ట్రపం ఈ నిర్ణయం తీసుకు్నట్టు తెలుస్తోంది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలు, మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదం, అస్థిరత ప్రచారాలకు ఆజ్యం పోస్తుందని వైట్ హౌస్ తెలిపింది.

1920ల్లో పుట్టిన ముస్లిం బ్రదర్ హుడ్..

ఈ ముస్లిం బ్రదర్ హుడ్ అనే దానిని 1920లో ఈజిప్టులో స్థాపించారు. ఇస్లామిక్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని లక్ష్యం. అరబ్‌ దేశాలకు వేగంగా వ్యాపించిన ఈ సంస్థ రహస్యంగా పనిచేస్తుంది. ఇంతకు ముందు అంటే ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కడా ఈ ముస్లింబ్రదర్ హుడ్ పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కూడా ఇటీవల ముస్లిం బ్రదర్‌హుడ్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే అది కేవలం ఆ స్ట్టేట్ కు మాత్రే పరిమితం అయింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఈ ముస్లిం బ్రదర్ హుడ్ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. అందుకే దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి కృషి చేస్తున్నారని మార్కో రూబియో అన్నారు.

Advertisment
తాజా కథనాలు