Zohran Mamdani: న్యూ యార్క్ లో చరిత్ర సృష్టించిన జోహ్రాన్.. మొదటి భారత సంతతి వ్యక్తి

అనుకున్నట్టుగానే న్యూయార్క్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దానీ విజయం సాధించారు. 2 మిలియన్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో జోహ్రాన్.. రిపబ్లికన్ కర్టిస్ స్లివా, స్వతంత్ర ఆండ్రూ క్యూమోలను ఓడించారు.

New Update
zohran (1)

ఈ సారి న్యూ యార్క్ ఎన్నికలు(new york elections) చాలా హాట్ హాట్ గా జరిగాయి. ఇక్కడి నుంచి డెమోక్రటిక్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న జోహ్రాన్మామ్దానీ పై ప్రపంచం అంతా దృష్టి సారించింది. అధ్యక్షుడు ట్రంప్ కూడా న్యూయార్క్ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకున్నారు. జోహ్రాన్ కు ఓటు వేస్తే యూదులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టే అంటూ ప్రచారం చేశారు.

Also Read :  మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలను ఫాలో అయిన న్యూయార్క్ కొత్త మేయర్

జోహ్రాన్ సాధించారు..

కానీ ఈరోజు జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్మామ్దానీ విజయం సాధించారు. తదుపరి మేయర్ గా ఆయన ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో జోహ్రాన్.. రిపబ్లికన్ కర్టిస్స్లివా, స్వతంత్ర ఆండ్రూ క్యూమోలను ఓడించారు. దీంతో పాటూ న్యూయార్క్ కు ఎన్నికైన మొదటి ముస్లిం, ఏషియన్ మేయర్ గా కూడా మామ్దానీ చరిత్ర సృష్టించారు. అదొక్కటే కాదు అతి చిన్న వయసు మేయర్ గా కూడా ఇతను రికార్డ్ సాధించాడు. ఈ సారి న్యూయార్క్ ఎన్నికల్లో మొత్తం 2 మిలియన్ల మంది ఓటింగ్ లో పాల్గొన్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. 1969లో జాన్ లిండ్సే గెలిచిన తర్వాత న్యూయార్క్ నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఇదే అత్యధికమని తెలిపారు. రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ జరిగింది.

జోహ్రాన్ గెలుపుకు కారణాలు ఇవే..

జొహ్రాన్(Zohran Mamdani).. తాను ఎన్నికయితే అద్దెలను తగ్గిస్తానని, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తానని, నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశాడు. దాంతో పాటూ న్యూయార్క్ లోకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తానని సంచలన వాగ్దానం చేశారు. ఇజ్రాయెల్ వెలుపల అత్యధికంగా యూదులు నివసించేది న్యూయార్క్ లోనే. పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాక.. ఇజ్రాయెల్ పై తన కోపాన్ని కూడా ప్రదర్శించారు. ఇలా ఓ వైపు సామాన్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ నీతి వైపు గొంతెత్తి మాట్లాడడం వల్లనే ఇతను ప్రస్తుతం అక్కడ మేయర్ ఎన్నికల్లో ఫేవరెట్ కంటెస్టెంట్ గా అయ్యారు. ముఖ్యంగా అక్కడి యువతరానికి బాగా నచ్చారు. అతను ముస్లిం అనీ, జీహాదీఅని, అతను గెలిస్తే యూదులకు భధ్రతవుండదనీ ప్రత్యర్థులు ఎంతలా ప్రచారం చేసినా.. మత, జాతి తారతమ్యాలు లేకుండా యువత అతనికి మద్దతుగా పోటెత్తింది. అతనికి మద్దతుగా వేలమంది వాలంటీర్లు న్యూయార్క్ వీథుల్లో ప్రచారం చేశారు.

జోహ్రాన్మామ్దానీడెమొక్రాటిక్ పార్టీ తరపునే అభ్యర్థి అయినా ఆ పార్టీ నుంచే అతనికి మద్దతు లేదు. ట్రంప్(Donald Trump) దుందుడుకు, అప్రజాస్వామిక విధానాలను ఎదిరించడంలో అలసత్వం చూపిస్తున్నారని కోపంతో వున్నారు. వారు ట్రంపును నేరుగా డీకొనే నాయకుడిగా జొహ్రాన్మమ్దానీని చూస్తున్నారు. న్యూ యార్క్ అమెరికాలో ఒక నగరమే కావచ్చు.. కానీ దాని బడ్జెట్ చాలా చిన్న దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. దీని కారణంగా ఒక్కడి మేయర్ గా జోహ్రాన్ ఎన్నిక.. తర్వాత అతని పాలసీల విజయం అమెరికా భవిష్యత్తుకు బాట కావచ్చు.

Also Read: BIG BREAKING: చిత్తుగా ఓడిపోయిన ట్రంప్ పార్టీ..జేడీ వాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి

Advertisment
తాజా కథనాలు