Bigg Boss Promo: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 5వ వారానికి చేరుకుంది. నాల్గవ వారం భారీ అంచనాలతో హౌజ్ లోకి అడుగుపెట్టిన మాస్క్ మ్యాన్ ఎలిమినేటై అందరికీ షాక్కిచ్చాడు. ఇక ఐదవ వారం ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేషన్ ప్రోమో వచ్చేసింది. తాజాగా విడుదలైన నామినేషన్స్ ప్రోమోలో శ్రీజ ఫుల్ ఫైర్ మీదున్నట్లు కనిపించింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా భరణి- శ్రీజ మధ్య ఆర్గుమెంట్ జరిగింది.
అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ''గార్డెన్ ఏరియాలో ఉంచిన మ్యాట్రిస్ పై నుంచి ఎవరు ముందుగా కాలు కింద పెడితే వారు.. నామినేషన్స్ లో'' ఉంటారని తెలిపారు. రౌండ్ కి ఒక్కరీచొప్పున.. ప్రతీ రౌండ్ లో నామినేట్ చేయాలనుకున్న ఒక కంటెస్టెంట్ ని బెడ్పై నుంచి కిందకి తోయాల్సి ఉంటుంది. అలా కింద పడిన కంటెస్టెంట్ నామినేట్ అయినట్లు. ఈ ప్రక్రియలో రీతూ, సంజనా, డెమోన్, సుమన్, దివ్య, ఫ్లోరా ఇప్పటికే నామినేట్ అవ్వగా.. తాజాగా విడుదలైన ప్రోమోలో భరణి, తనూజ, శ్రీజ, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్య ఈ పోటీ జరిగింది.
భరణికి ఇచ్చేపడేసిన శ్రీజ..
ప్రోమో ప్రకారం.. ఈ నలుగురు కలిసి ఓటింగ్ ఆధారంగా.. ఎవరు కిందకు వెళ్లాలో డిసైడ్ చేసుకుందామని అనుకుంటారు. ఇంతలో ఏదో గొడవ జరగడంతో భరణి శ్రీజను బెడ్ పై నుంచి కిందకు తోసేశాడు. దీంతో శ్రీజ ఫుల్ ఫైర్ అయ్యింది. ముందేమో తనూజ పేరు చెప్పిన మీరు.. ఇప్పుడు నన్నెలా తోసేశారు అంటూ వాదించింది. హౌజ్ అందరూ అంటున్నట్లు మీరు నిజంగానే రేలంగి మామయ్య! తనూజాతో బాండింగ్ ఉంది.. కాబట్టి ఆమెను తోయలేదు.. సేఫ్ గా ప్లే చేస్తున్నారు అంటూ భరణికి ఇచ్చిపడేసింది.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!