Encounter: ఒకే రోజు రెండు ఎన్‌కౌంటర్లు.. 30 మంది మావోయిస్టులు హతం!

మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఉదయం బీజాపుర్‌లో 26 మంది మావోలు చనిపోగా తాజాగా కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది.

New Update
Chhattisgarh: దండకారణ్యంలో తుపాకుల మోత.. 11 మంది మృతి!

Chattisgarh Dandakaranya two Maoist encounters today

Maoist: మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఉదయంగా బీజాపుర్‌లో 26 మంది మావోలు చనిపోగా.. తాజాగా కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది.

మావోయిస్టులకు భారీ నష్టం..

ఈ మేరకు బీజాపుర్‌ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని గంగలూరు అడవుల్లో మావోయిస్టులున్నట్లు సమాచారం అందింది. దీంతో సంయుక్త బలగాలు గురువారం ఉదయం నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగగా.. మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. పోలీసుల కాల్పుల్లో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

Also Read :   ఫిక్స్.. రేపే చాహల్తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం!

అలాగే మధ్యాహ్నం సమయంలో కాంకెర్‌ జిల్లాలోనూ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలిపారు. డీఆర్‌జీ, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లోనూ ప్రస్తుతం యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also read  :  దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?

ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు

encounter | chattisaghad | telugu-news | today telugu news | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు