అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!

అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్‌మెంట్స్ 2025' నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. సరిహద్దుల్లో శాంతిని నటిస్తూనే, మరోవైపు భారత్‌ని అన్ని వైపులా చుట్టుముట్టేందుకు బీజింగ్ కుట్ర చేస్తోందని ఈ రిపోర్ట్ హెచ్చరించింది.

New Update
China Vs india

ఇండియాను చుట్టుముట్టేందుకు చైనా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఓవైపు అరుణాచల్ ప్రదేశ్‌ను ప్రధాన ప్రయోజన లిస్ట్‌లో చేర్చుతూ.. మరోవైపు పాకిస్థాన్‌ను భారత్ పైకి ఉసిగొల్పుతూ చైనా ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్) తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్‌మెంట్స్ 2025' నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిహద్దుల్లో శాంతిని నటిస్తూనే, మరోవైపు భారత్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకు బీజింగ్ కుట్రలు పన్నుతోందని ఈ నివేదిక హెచ్చరించింది.

Also Read: డిఫెన్స్ రంగంలో ఇండియా మరో విజయం.. ఇక సముద్రంలోంచి అణు దాడులే!

అరుణాచల్‌పై చైనా ‘కోర్ ఇంట్రెస్ట్’ - పెరిగిన ఉద్రిక్తతలు

పెంటగాన్ నివేదికలోని అత్యంత ఆందోళనకరమైన అంశం అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వైఖరి. ఇప్పటివరకు తైవాన్, దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలను మాత్రమే తన 'ప్రధాన ప్రయోజన' జాబితాలో ఉంచిన చైనా, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా అందులో చేర్చింది. అరుణాచల్‌ను 'దక్షిణ టిబెట్'గా పిలుస్తూ, వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా తన సైనిక మౌలిక సదుపాయాలను భారీగా పెంచింది. చైనా చొరబాట్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా రికార్డు స్థాయిలో అధునాతన ఆయుధాలను, బలగాలను సరిహద్దుల్లో మోహరించింది.

పాకిస్థాన్‌తో కలిసి ‘టు-ఫ్రంట్’ వార్ ప్లాన్

భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు చైనా తన 'ఆల్ వెదర్ ఫ్రెండ్' పాకిస్థాన్‌ను పావుగా వాడుకుంటోంది. చైనా ఇప్పటికే పాకిస్థాన్‌కు 36 J-10C ఫైటర్ జెట్లను సరఫరా చేసింది. వీటిని పాక్ భారత సరిహద్దులకు సమీపంలో మోహరించడం గమనార్హం. పాకిస్థాన్ గడ్డపై సొంతంగా ఒక సైనిక స్థావరాన్ని నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని పెంటగాన్ వెల్లడించింది. దీని ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంపై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది. అలాగే 2024 డిసెంబర్‌లో చైనా-పాక్ నిర్వహించిన ఉమ్మడి కౌంటర్ టెర్రర్ డ్రిల్స్ ఈ బంధం ఎంత బలపడిందో నిరూపిస్తున్నాయి.

2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాల 

చైనా తన అణు సామర్థ్యాన్ని ఊహించని వేగంతో పెంచుకుంటోంది. ప్రస్తుతం చైనా వద్ద 600కు పైగా కార్యాచరణ అణు బాంబులు ఉండగా, 2030 నాటికి వీటి సంఖ్యను 1000 దాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సముద్ర గర్భంలో తన శక్తిని చాటేందుకు 2035 నాటికి 6 నుండి 9 విమానవాహక నౌకలను నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే 'ఫుజియాన్' నౌక తన ట్రయల్స్ పూర్తి చేసుకుంది.

Also Read: అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!

చైనా ‘చాపకింద నీరు’ వ్యూహం

భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీయడానికి చైనా ఓ వింత వ్యూహాన్ని అనుసరిస్తోంది. గతేడాది లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణకు అంగీకరించిన చైనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లు నటిస్తోంది. కానీ ఇది కేవలం అమెరికాకు భారత్ దూరం కావాలనే ఉద్దేశంతో చేస్తున్న 'టాక్టికల్ మూవ్' అని పెంటగాన్ పేర్కొంది. భారత్ కూడా చైనా ఉద్దేశాలను ఎంతమాత్రం నమ్మడం లేదని, అపనమ్మకం అలాగే ఉందని నివేదిక స్పష్టం చేసింది.

గ్లోబల్ నెట్‌వర్క్: చుట్టుముట్టే ప్రయత్నం

పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, యూఏఈ వంటి మరో 20 దేశాల్లో తన సైనిక ఉనికిని చాటడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు భారత్ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. చైనా చేస్తున్న ఈ కుతంత్రాలను ఎదుర్కోవడానికి భారత్ తన రక్షణ బడ్జెట్‌ను పెంచడమే కాకుండా, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు