/rtv/media/media_files/2025/08/16/khammam-crime-news-2025-08-16-17-37-19.jpg)
Khammam Crime News
నేటి యువతరానికి బండి అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము. వాటిల్లో పల్సర్ బైక్(Pulsar Bike) ఒకటి. ఇది భారతదేశంలో యువతకు స్పోర్టీ ఐకాన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీని స్పోర్టీ లుక్, ఇంజిన్, సరసమైన ధర దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటిగా నిలిపింది. అయితే ఈ బండి పిచ్చిలో పడి ఓ యువకుడు కుటుంబ బంధాలు, ఆత్మీయతలు, నమ్మకాలు పక్కన పెట్టి మూర్ఖుడు మారడు. బండి మోజ్‌లో పడి కన్నవాళ్లనే నరికే వరకు వచ్చాడు. అంతేకాదు నచ్చిన బైక్ కొని ఇవ్వకపోతే ఏకంగా కాటికే సాగనంపాలని నిర్ణయించుకున్నాడు. కొడుకుగా తల్లిదండ్రులపై ప్రేమ, అనురాగంగా ఉండాల్సింది పోయి గొడ్డలితో దాడి చేసి సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత విద్వేషాలతో బంధాలు, మానవ సంబంధాలు తెగిపోతుంటే.. తాజాగా కన్న తండ్రిని కొడుకే నరికి చంపిన దారుణమైన సంఘటన తెలంగాణలో కలకలం రేపింది.
బైక్ కొనివ్వలేమని చెప్పినా..
ఖమ్మం జిల్లాలో మానవ సంబంధాలను మంటగలిపే దారుణం వెలుగు చూసింది. పల్సర్ బైక్ కొనివ్వలేదన్న కోపంతో కన్న కొడుకే తండ్రిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం మంగళిగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగయ్య, నాగలక్ష్మి దంపతులకు సతీష్ అనే కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా సతీష్ తన తల్లిదండ్రులను పల్సర్ బైక్ కొనివ్వమని వేధిస్తున్నాడు. పేదరికం కారణంగా బైక్ కొనివ్వలేమని చెప్పినా వినకుండా తరచూ గొడవపడుతూనే ఉన్నాడు. ఈ వేధింపులు శనివారం పరాకాష్టకు చేరాయి. బైక్ గురించి మళ్ళీ గొడవ పడ్డ సతీష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని తన తండ్రి నాగయ్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..
ఈ దాడిలో నాగయ్య తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తండ్రిని నరికిన తర్వాత తల్లి నాగలక్ష్మిని కూడా గొడ్డలితో వెంటాడాడు. ఆమె ప్రాణభయంతో పారిపోయి స్థానికులను సహాయం కోరింది. స్థానికుల సాయంతో తీవ్ర గాయాలతో ఉన్న నాగయ్యను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తల్లి నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్సర్ బైక్ కోసం ఒక కుమారుడు కన్నతండ్రిపై హత్యాయత్నం చేయడం మంగళిగూడెం గ్రామంలో విషాదం నింపింది. ఈ ఘటనపై పోలీసులు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...