గత కొంతకాలంగా జమిలి ఎన్నికల అంశం దేశంలో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లోనే లేదా వచ్చే సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల సమర్పించిన రిపోర్టును కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదించింది.
Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు
ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానం అమలు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని కోవింద్ కమిటీ వెల్లడించింది. ఆ తర్వాత ఇది వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని చెప్పింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలను సైతం కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు జమిలి ఎన్నికల విషయంపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 30కి పైగా పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించగా.. కాంగ్రెస్‌తో పాటు మరో 15 పార్టీలు వ్యతిరేకించాయి.
Also Read: అదానీ, మోదీతో రాహుల్ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
అయితే దేశంలో జమిలి ఎన్నికల విధానం అనేది ఆచరణాత్మకం కాదని కాంగ్రెస్ వాదిస్తోంది. తాము ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య మనుగడ సాగించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని మల్లికార్జున ఖర్గే ఖరాఖండీగా చెబుతున్నారు. మరీ ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ప్రవేశపెడతారా ? లేదా వచ్చే సమావేశాల్లో ప్రవేశపెడతారా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: జీవో 46పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు
Also Read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్ 19 మహమ్మారి..39 మంది మృతి