Karnataka: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్‌ 19 మహమ్మారి..39 మంది మృతి

కొవిడ్ నుంచి ప్రపంచం ఇప్పుప్పుడిప్పుడే కోలుకుంటోంది.కానీ, మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో బెంగళూరులో నలుగురు సహా 39 మంది చనిపోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

New Update
COVID-19 : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వారం రోజుల్లో 26 వేల కేసులు

Covid:కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నప్పటి దీని ముప్పు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. రూపాలు మార్చుకుని.. ఈ వైరస్ ఇంకా ప్రజల మీద దాడి చేస్తోంది. అయితే, ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. దీంతో కరోనా వైరస్ గురించి పట్టించుకోలేదు. కానీ, మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని తాజా నివేదికలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

Also Read: Kasturi: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో బెంగళూరులో నలుగురు సహా 39 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘కేసులు తగ్గడంతో 2024 మహమ్మారిని ప్రపంచం మరచిపోయిన సంవత్సరంగా అనిపించింది.. సాధారణ స్థితి నెలకొనడం, ఇతర సమస్యలతో ప్రపంచం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.

Also Read: Telangana: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

అయినప్పటికీ వైరస్ నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. బెంగళూరులో నలుగురు సహా కర్ణాటకలో ఈ ఏడాది 39 మంది ప్రాణాలు వదిలారు. ఈ సంఖ్య మునుపటితో పోలిస్తే చిన్నదే అయినప్పటికీ, కోవిడ్-19 ముప్పు పోయిందని ప్రపంచం అనుకుంటున్న తరుణంలోమరోసారి నేను ఉన్నాను అంటూ తన ఉనికిని గుర్తుచేస్తుంది’’ అని నిపుణులు అన్నారు.

Also Read: US: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

బెంగళూరు సహా కర్ణాటకలో కరోనా వైరస్ ప్రభావంపై ఆ రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం ఇస్తూ.. ఈ వివరాలను ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తర్వాత 2020లో కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 12,143 మరణాలు నమోదయ్యాయని, ఒక్క బెంగళూరులోనే 4,344 మంది (దాదాపు 36 శాతం) మృతిచెందారని ప్రకటించింది. ముఖ్యంగా 2021 నాటి సెకెండ్ వేవ్‌‌‌‌తో కర్ణాటకలో ఏకంగా 26,245 మంది ప్రాణాలు కోల్పోగా.. బెంగళూరులో అత్యధికంగా 12,074 మరణాలు నమోదైనట్లు అధికారులు వివరించారు.

Also Read: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

ఇక, టీకాలు, మెరుగైన వైద్య సౌకర్యాలతో 2022 నుంచి క్రమంగా కోవిడ్ కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది బెంగళూరులో 575 సహా కర్ణాటకలో 1,920 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గతేడాది బెంగళూరులో 17 సహా 64 మంది కోవిడ్-19తో చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2020-2024 మధ్య కర్ణాటక వ్యాప్తంగా 40,411 కరోనా మరణాలు నమోదైతే.. బెంగళూరులోనే 17,014 కేసులు ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు