మతం బట్టి రిజర్వేషన్లు ఇవ్వలేమని...ఓబీసీని రద్దు చేస్తూ కోలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం కోలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వలేము అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మతాల ఆధారంగా ఇవ్వలేదని...వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తున్నారని జస్టిస్ గవాయ్ చెప్పారు. ఈ విచారణలో పశ్చిమబెంగాల్ తరుఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తే...ప్రతివాదుల తరుఫున మర సీనియర్ న్యాయవాది సీఎస్ పట్వాలియా వాదించారు. Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! Supreme Court ఓబీసీ వర్గీకరణలను కోలకత్తా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ..77 కమ్యూనిటీల వర్గీకరణ, ఎక్కువగా ముస్లిం మతానికి చెందినవి. ఇవన్నీ వర్గాల వెనుకబాటు ప్రాతిపదికన మంజూరు చేయబడిందని సమర్పించారు. పశ్చిమ బెంగాల్ లో 27-28% మైనారిటీ జనాభా ఉందని ఆయన స్పష్టం చేశారు. రంగనాథ్ కమిషన్ ముస్లింలకు 10% రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. అలాగే హిందువులలో 66 సంఘాలను వెనుకబడిన వర్గాలుగా వర్గీకరించారు. అప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ల కోసం ఏం చేయాలనే ప్రశ్న తలెత్తింది. అందువల్ల రంగనాథ్ కమిషన్.. ముస్లింలలోని 76 కమ్యూనిటీలను వెనుకబడిన తరగతులుగా వర్గీకరించి, రిజర్వేషన్ లిస్ట్లో చేర్చిందని చెప్పారు. కానీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ఆధారపడి కోలకత్తా హైకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసిందని సిబల్ తెలిపారు. దీనికే జస్టస్ గవాయి...రిజర్వేషన్లు మతాల ఆధారంగా కాదు అంటూ వ్యాఖ్యానించారు. యితే కపిల్ సిబాల్ కూడా మతం ఆధారంగా చేయాలని తామూ కోరడం లేదని...వెనుకబాటుతనం ఆధారంగానే అన్ని వర్గాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..! దీనికి ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది పిఎస్ పట్వాలియా మాట్లాడుతూ ఎలాంటి డేటా లేదా సర్వే లేకుండానే రిజర్వేషన్లు ఇచ్చారని, వెనుకబడిన తరగతుల కమిషన్‌ను దాటవేస్తూ రాష్ట్ర వాదనలను తిప్పికొట్టారు. 2010లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వెంటనే కమిషన్‌ను సంప్రదించకుండానే 77 వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని ఆయన చెప్పారు. దీంతో ధర్మాసనంలో జ్డి అయిన జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ..ఇందిరా సాహ్ని నుంచి.. గుర్తించడం, వర్గీకరించడం కార్యనిర్వాహక అధికారి అధికారం అని భావించారు. రాష్ట్రానికి అధికారాన్ని ఇచ్చే శాసనంలోని ఒక నిబంధనను ఎలా కొట్టివేయవచ్చు? ఒక నిబంధనను దుర్వినియోగం చేయడం సాధ్యమేనా? డౌన్? అని ఆయన ప్రశ్నించారు. తరువాత ఈ కేసులో వివరాణాత్మక విచారణ చేయాల్సి ఉందంటూ..దీనిని 2025 జనవరి 7కు వాయిదా వేశారు. Also Read: TS: తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!