![RAHUL GAndhi](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/09/L7ValGPrOnxLU91ZOJev.jpg)
ప్రస్తుతం పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంపై చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోంది. మళ్లీ సోమవారం ఉదయం కూడా పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధానీ మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఫేస్ మాస్కులు పెట్టుకొని వచ్చిన వాళ్లని రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేశారు.
Also read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్ 19 మహమ్మారి..39 మంది మృతి
Mock Interview In Parliament
కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా.. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగుర్, సప్తగిరి శంకర్ ఉలక తమ మోహాలకు మోదీ, అదానీ ఫొటోల మాస్కులు ధరించారు. వాళ్లిదరిని ఫొటో తీస్తూ.. మీ ఇద్దరి మధ్య బంధమెంటో చెప్పాలని విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. దీనికి వాళ్లు స్పందించారు. మేము ఏం చేసినా కలిసే చేశామని.. మా ఇద్దరిదీ ఏళ్లనాటి బంధమని సమాధానమిచ్చారు. అదానీ, ప్రధాని మోదీ ఒకటేనని చూపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
यह एक ख़ास और पुराना रिश्ता है! #ModiAdaniEkHai pic.twitter.com/s6iF1YeCcX
— Rahul Gandhi (@RahulGandhi) December 9, 2024
Also Read: జీవో 46పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు
మరోవైపు జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఆర్థిక సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై సోమవారం జరిగిన పార్లమెంటులో సమావేశాల్లో గందరగోళం చెలరేగింది. దీనిపై కూడా చర్చ జరపాలని బీజీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. చివరికీ లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై చర్చ జరిపేందుకు ముందుకు రావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
Also Read: సిరియాలో అసద్ పాలన అంతం వెనుక 14 ఏళ్ల బాలుడి హస్తం..
Also Read: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!