UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు
యూఏఈలో ఇద్దరు భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. మన విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత కుటుంబాలకు కూడా సమాచారం అందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యూఏఈలో ఇద్దరు భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. మన విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత కుటుంబాలకు కూడా సమాచారం అందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యూఏఈలో భారతీయ మహిళకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. ఓ చిన్నారి మృతి కేసులో ఈ శిక్ష విధించింది. ఫిబ్రవరి 15నే మరణశిక్ష అమలు చేసినప్పటికీ.. ఈ విషయాన్ని తాజాగా ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలిపింది.
నైజీరియాలో దారుణం జరిగింది. ఆకలికి తాళలేక రోడ్డెక్కి నిరసనలు చేసిన 76 మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు. ఆపై కోర్టు వారికి మరణశిక్షను విధించింది. అందులో 29 మంది చిన్నారులు ఉండటం సంచలనం రేపుతోంది.
అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో ఏటా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్సీఆర్బీ (NCRB) నివేదిక ప్రకారం ఒక్క 2023 లోనే ఏకంగా 561 మంది ఖైదీలు మరణించారు. ఈ ఖైదీల మరణాల సంఖ్య పెరగడానికి పలు కారణాలతో పాటు కోర్టులు విధించిన మరణ శిక్షలు కూడా ఉన్నాయి.
ప్రపంచంలో మొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను వాడి ఓ దోషికి మరణశిక్ష విధించారు. 1988లో అమెరికాలో ఓ మతాధికారి భర్య ఎలిజబెత్ సెనట్‌ను మర్డర్ చేసిన కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే దోషికి ఈ మరణశిక్షను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.
ఇరాన్లో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 419 మందికి మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారీ స్థాయిలో మరణ శిక్షలను అమలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐరాస.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి విచారణ జరగలేదని తమకు తెలిసినట్లు పేర్కొంది.