Maoist: మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే!

మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామంటున్న బీజేపీ ఇప్పటికే రూ.5,601 కోట్లు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్ల కేటాయించగా మరిన్ని నిధులు విడుదల చేయాలని భావిస్తోంది.  

New Update
maoist oparation

Maoist oparation

Maoist: మవోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామంటున్న బీజేపీ ఇప్పటికే రూ.5,601 కోట్లు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్ల కేటాయించగా మరిం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

పథకాల ద్వారా నిధులు విడుదల..

ఈ మేరకు ఇప్పటికే 2026 వరకు భారత దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే భారీ ఆపరేషన్స్ చేపడుతోంది. 'ఆపరేషన్ కగార్' పేరుతో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల అడవులను జల్లెడ పడుతుంది. ఇందుకోసం వేల సంఖ్యలో మిలటరీ బలగాలను దింపి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో ఏడాదికి దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు ప్రభుత్వం.. రోజు రోజుకు పెంచుతూ పోతోంది. మావోయిస్టుల అడ్డ ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. మావోయిస్టు అగ్రనాయకత్వం అబూజ్‌మడ్‌లో ఉండగా.. దట్టమైన అటవీప్రాంతం, ఎత్తైన కొండలను చేధించడం పోలీసులకు కష్టతరంగా మారింది. కానీ మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసేందుకు బలమైన సంకల్పంతో ముందుకెళ్తున్న కేంద్రం.. ఇందుకోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది. సెక్యూరిటీ రిలేటెడ్‌ ఖర్చు, స్పెషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్కీం, స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ వంటి పథకాల పేరుతో నిధులు రిలీజ్ చేస్తోంది. 

ఇది కూడా చదవండి: IT Jobs: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!

2017-23 మధ్య రూ.5,601 కోట్లు..

ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు 2017-23 మధ్య రూ.5,601 కోట్లు విడుదల చేయడం విశేషం. కాగా ఇందులో ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్లు విడుదల చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిధులను పెంచాలని చూస్తోంది. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్రకు నిధులు తగ్గించి ఛత్తీస్‌గఢ్‌పై ఖర్చు చేస్తోంది. కేవలం 2024లోనే ఛత్తీస్‌గఢ్‌లో 287 మంది మావోయిస్టులు చనిపోగా వెయ్యిమందిని అరెస్ట్ చేశారు. 837 మంది లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌లో 300 భద్రతా దళాల క్యాంపులుండగా మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలకు కావాల్సిన అన్ని సదుపాయాలూ సమకూర్చుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఆ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు