హైదరాబాద్‌లో జూపార్కు నుంచి ఆరాంఘర్ మధ్య ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు బల్దియా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిచింది. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు మొత్తం 4.08 కిలోమీటర్ల వరకు దాదాపు రూ.800 కోట్లతో నిర్మించారు. అయితే గత ఏడాది డిసెంబర్‌లోనే దీనికి ప్రారంభోత్సవం జరిగింది. కానీ పలు కారణాల వల్ల ఆగిపోయింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది.
Also Read: BPSC పేపర్ లీక్ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ''వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ నరసింహరావు ఫ్లేఓవర్ నిర్మించుకున్నాం. మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నాం. ఈ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొ సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నాం. ఆనాడు నిజాం హయాంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చారు.
The Aramghar-Zoo Park flyover is named after former Prime Minister 'Dr. Manmohan Singh'
— Congress for Telangana (@Congress4TS) January 6, 2025
ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్‌కు
మాజీ ప్రధాని 'డాక్టర్ మన్మోహన్ సింగ్' పేరు
-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి#RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/oZ5QAIc0ys
Also Read: భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?
హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి కోసం ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతాం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. నగర అభివృద్ధిలో మాత్రం అందరినీ కలుపుకుని ముందుకెళ్తాం. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు వెళ్తుంది.
Also Read: ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి
ఇది ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ హైదరాబాద్. మిరాలం ట్యాంక్‌పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదే. త్వరలోనే గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని'' రేవంత్ అన్నారు.