/rtv/media/media_files/2025/10/11/mayavathi-2025-10-11-21-27-56.jpg)
bsp chief mayawati responds on Dalit ips officer Suicide
హర్యానాలో సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. '' దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలపై కుల వివక్ష, వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సంఘటనతో ఇవి జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. ఈ విషాద ఘటనపై దేశంలోని దళితుల్లో ఆందోళన, ఆవేదన, నిరాశ నెలకొంది.
Also Read: రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
పాలనా వ్యవస్థలో కులతత్వం ఎలా పాతుకుపోయిందో.. అధిపత్య పాలకులు, ప్రభుత్వాలు, అధికార యంత్రాగం ఇలాంటి వాటిని అడ్డుకోవడంలో ఎలా విఫలమవుతున్నాయో రుజువు చేస్తుంది. ఈ ఘటనపై CBIతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే కుల వివక్షపై ఆరోపణలు బయటపడుతున్నాయి. అందుకే దర్యాప్తును పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా జరపాలి. కేంద్రం, సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనను సామాజిక న్యాయం కోణంలో చూడాలి. ఈ కేసును అత్యంత సీరియస్‌గా పరిగణించాలి.
Also Read: ట్రంప్ మరో టారీఫ్ బాంబ్.. చైనా దిగుమతులపై 100% సుంకాలు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఎల్లప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేసే ఆధిపత్య వర్గాల వాళ్లు ఆ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే బహుజన, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్లు విద్య, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినా, రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టినా వాళ్లందరినీ కులం ఎప్పటికీ వెంటాడుతుంది. కులం పేరుతో దౌర్జన్యాలు, అణిచివేత అనేది ఈ వర్గాలపై అన్ని స్థాయిల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనతో ఇది రుజువైందని'' మాయావతి అన్నారు.
Also Read: విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు