/rtv/media/media_files/2025/07/29/brother-has-a-rare-disease-murdered-older-sister-2025-07-29-15-42-28.jpg)
ఈ చిత్రం ఏఐ తో జనరేట్ చేయబడినది.
చిన్న చిన్న కారణాలతోనే ఆత్మీయులను చంపుకోవడం సర్వసాధారణమైంది. అనుమానంతో అక్కను చంపిన తమ్ముడి విషయం మరిచిపోకముందే తమ్ముడిని అక్క కడతేర్చిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హొళల్కెర పరిధిలోని దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్పకు మల్లికార్జున, నిశా ఇద్దరు సంతానం. నిశాకు శ్యామనూరుకు చెందిన మంజునాథ్‌తో పెళ్లైంది.ఇక తమ్ముడు మల్లికార్జున బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల మల్లికార్జున బెంగళూరు నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని దావణగెరెలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి చేరుకున్న అతని అక్క, భావలు మల్లికార్జున ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అవసరమైన చికిత్సలు అందించాలని వైద్యులను కోరారు.
Also Read : డబ్బు కోసం ఎంతకు తెగించావు.. బాయ్‌ఫ్రెండ్‌నే కిడ్నాప్ చేయించి ప్లాన్ వేశావ్‌గా!
Sister Killed Brother
వైద్య పరీక్షల్లో భాగంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. అప్పుడే షాకింగ్ విషయం తెలిసింది. మల్లికార్జునకు నయంకాని వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ విషయాన్ని మల్లికార్జున అక్కభావలు నిశా, మంజునాథ్‌కు తెలిపారు. అతనికి మెరుగైన వైద్యం అందిస్తే వ్యాధినయమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో దావణగెరె నుంచి మంచి చికిత్సకోసం కుటుంబ సభ్యులు మరో ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. మల్లికార్జునను వాహనంలో తీసుకుని వెళ్తుండగా తనకు సోకిన వ్యాధి గురించి అక్కకు చెప్పుకుని బావురుమన్నాడు. తనకు నయం కాని వ్యాధి సోకిందని, ఇప్పటికే చాలా అప్పులు చేశానని, తనకు బతకడం ఇష్టం లేదని. తనకు చావు ఒక్కటే మార్గమని వాపోయాడు.
అయితే తమ్మునికి సోకిన వ్యాధి గురించి నిశా తన భర్తతో చర్చించింది. తన తమ్ముుడుకి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని నిశా భావించింది. ఇదే విషయాన్ని తన భర్తతో చెప్పడంతో ఏం చేద్దామని చర్చించుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చిన వారిరద్దరూ మల్లికార్జునను మరో ఆస్పత్రికి తరలించే నెపంతో అక్కడి నుంచి వాహనంలో తీసుకుని బయలు దేరారు.
ఈ క్రమంలో మల్లికార్జునను వాహనంలో తీసుకువెళ్తూ మార్గమధ్యలోనే గొంతుకు టవల్‌బిగించి ఇద్దరూ కలిసి చంపేశారు. తమపైన ఎలాంటి అనుమానం రాదన్న నమ్మకంతో మల్లికార్జునను తీసుకుని సొంతగ్రామమైన దుమ్మికి తీసుకు వచ్చారు. తమ్ముడు తీవ్రంగా గాయపడడంతో వైద్యులు మరో అస్పత్రికి తరలించాలని సూచించారని,ఈ క్రమంలో తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని నమ్మించారు.
అది నిజమేనని నమ్మిన తల్లిదండ్రులు చెట్టంత కొడుకును పోగొట్టుకున్న బాధలో తీవ్రంగా విలపించారు. అనంతరం అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అంత్యక్రియలకు తీసుకెళ్తున్న సమయంలో మల్లికార్జున గొంతుపై గాయాలు ఉండటాన్ని తండ్రి గమనించిన తండ్రి నాగరాజప్ప అల్లుడు కూతురును నిలదీశారు. వారు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో పోలీసుకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిశా, మంజునాథ్‌లకు తమదైన స్టైల్‌లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో జరిగిన సంఘటనను వివరించారు. తమ తమ్ముడికి వచ్చిన వ్యాధి గ్రామంలో తెలిస్తే కుటుంబ పరువు పోతుందని తమ్మున్ని తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు నిశా, మంజునాథ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: హిందుపురంలో భారీ చోరీ.. ఒక్కరోజు సెలవుకే బ్యాంక్ మొత్తం ఖాళీ చేసిన దొంగలు!
karnataka | disease | national news in Telugu | latest-telugu-news | telugu-news | telugu crime news