Bengaluru: డబ్బు కోసం ఎంతకు తెగించావు.. బాయ్‌ఫ్రెండ్‌నే కిడ్నాప్ చేయించి ప్లాన్ వేశావ్‌గా!

బెంగళూరులో ఓ ప్రియురాలు తన లవర్ లారెన్స్‌ను కిడ్నాప్ చేయించి కుటుంబ సభ్యులకు రూ.2.5 కోట్లు డిమాండ్ చేసింది. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Kidnap

Kidnap

రోజురోజుకీ మహిళలు దారుణాలకి పాల్పడుతున్నారు. కుటుంబం, బంధువులు, ప్రియుడు, భర్త వంటివి చూడకుండా డబ్బుల కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే డబ్బు, వివాహేతర సంబంధాల వల్ల భర్తలను చంపేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి డబ్బు కోసం ప్రేమించిన ప్రియుడిని కిడ్నాప్ చేయించింది. ప్రేమించినట్లు నటించి.. డబ్బు కోసం చివరకు తన ప్రియుడినే కిడ్నాప్ చేసి నరకయాతనకు అనుభవించేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే..  బెంగళూరుకి చెందిన లారెన్స్ మెల్విన్ దుబాయ్‌లో ట్రావెల్ కంపెనీలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. అయితే సెలవుల మీద ఇటీవల బెంగళూరుకి వచ్చాడు. ఈ సమయంలో తన ప్రేయసిని కలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ఇద్దరు కలవడానికి ప్లాన్ వేశారు. 

ఇది కూడా చూడండి:Bank Robbed: హిందుపురంలో భారీ చోరీ.. ఒక్కరోజు సెలవుకే బ్యాంక్‌ మొత్తం ఖాళీ చేసిన దొంగలు!

వారం రోజులు కనిపించకపోవడంతో..

లారెన్స్ ప్రియురాలు మహిమా బయటకు వెళ్దామని అడగడంతో కారు బుక్ చేసుకున్నారు. కారులో కొంత దూరం వెళ్లగా మధ్యలో ఆ డ్రైవర్ వేరే దారి నుంచి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి లారెన్స్‌ను కొట్టారు. అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకున్నారు. అతనిపై దాడి చేయడంతో పాటు ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించారు. దాదాపుగా వారం రోజుల పాటు లారెన్స్‌ను ఆ అపార్ట్‌మెంట్‌లో పెట్టి దాడి చేశారు. అయితే దుబాయ్ నుంచి సెలవులకు బెంగళూరు వచ్చిన కొడుకు వారం రోజులు అయినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి:  TG News: ఖమ్మంలో అర్థరాత్రి హైటెన్షన్ .. ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమాస్పద మృతి!

రూ.2.5 కోట్లు ఇస్తేనే లారెన్స్ విడుదల..

ఇంతలో లారెన్స్‌ను బంధించిన ప్రియురాలు.. అతని కుటుంబ సభ్యులకు కాల్ చేసి బెదిరించింది. లారెన్స్ కుటుంబ సభ్యులకు మహిమా కాల్ చేసి బెదిరించింది. కొడుకును కిడ్నాప్ చేశామని రూ.2.5 కోట్లు ఇస్తే విడుదల చేస్తామని ఆమె కుటుంబ సభ్యులను డిమాండ్ చేసింది. ఈ డబ్బులు ఇస్తేనే లారెన్స్‌ను విడిచి పెడతామని తెలిపింది. అయితే లారెన్స్‌ను బంధించిన అపార్ట్‌మెంట్‌లో వారి తీరు కాస్త అనుమానాస్పదంగా ఉన్నారు. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ బాధితుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇది కూడా చూడండి: BREAKING: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. స్పాట్‌లోనే 18 మంది?

ప్రియురాలే చేయించిందని..

లారెన్స్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టగా లారెన్స్ ప్రియురాలు ఈ కిడ్నాప్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ప్రియురాలు మహిమా పరారీలో ఉంది. ఈమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. నలుగురిని ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈమె కిడ్నాప్ చేయడానికి సాయపడిన ఇంకో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు మహిమాతో పాటు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  Marijuana Smuggling: ఎంతకు తెగించార్రా...ప్యాకెట్లు..చాక్లెట్లు...కాదు ఏకంగా ఇంజెక్షన్లు

Advertisment
తాజా కథనాలు