Bank Robbed: హిందుపురంలో భారీ చోరీ.. ఒక్కరోజు సెలవుకే బ్యాంక్‌ మొత్తం ఖాళీ చేసిన దొంగలు!

హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలో ఉంటున్న ఎస్‌బీఐ బ్యాంకులో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో.. బ్యాంకు వెనక వైపు నుంచి ఉన్న కిటికీను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి దొంగలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Bank Robbed

Bank Robbed

రోజురోజుకీ దొంగల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇంటిని, బంగారం షాపులు, చివరకు ప్రజలు సేఫ్టీ కోసం దాచుకునే బ్యాంకుల్లో కూడా చోరీ చేస్తున్నారు. ఇటవల సూర్యాపేటలో ఓ జ్యూవెలరీ షాపులో దొంగతనం జరగ్గా, తాజాగా హిందూపురంలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలో ఉంటున్న ఎస్‌బీఐ బ్యాంకులో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కొందరు గుర్తు తెలియని దుండుగులు దొంగతనం చేశారు. బ్యాంకు వెనక వైపు నుంచి ఉన్న కిటికీను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేశారు. బ్యాంకు లోపల ఉన్న ఇనుప లాకర్ మెయిన్ డోర్‌ను కూడా పగలగొట్టారు.

ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

తెలివిగా సెలవు రోజు భారీ చోరీకి ప్లాన్..

దొంగలు తెలివిగా సెలవు రోజు చోరీకి ప్లాన్ చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఎవరూ ఉండరు, ఇబ్బంది ఉండదని ప్లాన్ చేశారు. ఆ తర్వాత రోజు అధికారులు బ్యాంకుకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులకు విషయం తెలియజేశారు. వారు వచ్చి బ్యాంకు మొత్తాన్ని పరిశీలించారు. దొంగల ఫింగర్ ప్రింట్‌లను తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న సీసీ టీవీ ద్వారా నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులో ఎంత డబ్బు, బంగారం దొంగలు చోరీ చేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?

ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేటలో ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. మొత్తం ఐదుగురు దొంగలు ప్లాన్ చేసి మరి 2.05 కేజీలు బంగారాన్ని కాజేశారు. వీరిలో ముగ్గురు నేపాల్ దేశానికి చెందిన వారు కాగా, మిగతా ఇద్దరూ జార్ఖండ్‌కు చెందిన వారు. అయితే ఈ జ్యూవెలరీ షాపులో చోరీ చేయడానికి నిందితులు దీని ఎదురుగా ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: నిమిష ఉరిశిక్ష రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ

పక్కా ప్లానింగ్‌తో అర్థ రాత్రి సమయాల్లో ప్లాన్ చేసి షాపులో ఉన్న బంగారాన్ని కొట్టేశారు. ఆ తర్వాత జ్యూవెలరీ షాపు వాళ్లు వెళ్లి చూడగా దొంగతనం జరిగి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ప్లానింగ్‌తో చోరీ చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. వీరి కోసం పోలీసులు మొత్తం ఐదు బృందాలుగా గాలిస్తున్నారు. పలు సెక్షన్ల మీద వీరిపై కేసులు నమోదు చేశారు. ఇదే కాకుండా ఇలాంటి చోరీలు గతంలో కూడా చేయడం వల్ల వీరిపై కేసులు నమోదై ఉన్నాయి.

ఇది కూడా చూడండి: FIDE Women's World Cup 2025: చెస్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాకే?

Advertisment
తాజా కథనాలు