రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. ఓటర్లకు తాను డబ్బులు పంపినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని పంపించారు. By B Aravind 22 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. తనపై చేసిన ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని పంపించారు. ఆ నోటీసుల్లో వీళ్లిద్దరితో పాటు సుప్రియా శ్రినేట్ పేరు కూడా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు.. అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. Also Read: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు పాల్‌ఘర్ జిల్లాలోని విరార్ అనే ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ ఆరోపణలు చేసింది. నాలసోపరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌కు ఓటు వేయాలని కోరుతూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే మరికొందరు నాయకులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీజేపీ డబ్బులు పంచుతోందని.. పార్టీ అధినేతలు కూడా ఇందులో పాల్గొంటున్నారని చెప్పింది. ఎన్నికల కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలండూ డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలకు శుక్రవారం పరువునష్టం నోటీసులు అందాయి. Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను.. ఇలాంటి చర్యలకు ఎప్పుడూ కూడా పాల్పడలేదని తావ్డే మీడియాకు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నేతలు నా పరువుకు భంగం కలిగించాలని అనుకున్నారని తెలిపారు. పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. వాళ్లు నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందుకే తాను నోటీసులు పంపించానని స్పష్టం చేశారు. Also Read: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు #national-news #mallikharjan-kharge #telugu-news #congress #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి