World War 3: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ కమాండర్

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని ఉక్రెయిన్‌కు చెందిన ఓ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ జలుజ్నీ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
hhh

ఉక్రెయిన్‌ - రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవైపు ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతిస్తోండగా.. రష్యా దూకుడు చూపిస్తోంది. దీనివల్ల పరిస్థితులు ఇంకా తీవ్రతరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు చెందిన ఓ మాజీ కమాండర్-ఇన్-చీఫ్  వాలెరీ జలుజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల్లో రష్యా మిత్రదేశాలు పాల్గొనడం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోందని తెలిపారు.    

Also Read: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్‌ స్వీట్ రియాక్షన్!

Russia - Ukraine

ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్‌ పోరాటం చేస్తున్నారని.. ఇరాన్ తయారుచేసిన ఆయుధ సామాగ్రితో అనేకమంది ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం ఉత్తర కొరియా సైనికులు, చైనా ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉక్రెయిన్‌ రాయబారిగా ఉన్న ఆయన తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.   

Also Read :  కుర్రాళ్ళ దిల్ దోచేస్తున్న బాలయ్య బ్యూటీ.. గోల్డెన్ డ్రెస్ లో హాట్ ఫోజులు

అయితే ఈ సంక్షోభం మరింత విస్తరించకుండా ఉండేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్‌ మిత్రదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక్కడితో ఈ సంక్షోభాన్ని ఆపడం సాధ్యమవుతుందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్యపక్షాలు దీన్ని అర్థం చేసుకోవడం లేదని చెప్పారు. ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక మంది శత్రువులు ఉన్నారని విషయం వాస్తవమని చెప్పారు. 

Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?

ఇదిలాఉండగా ఇటీవల ఉక్రెయిన్ అమెరికా రూపొందించిన క్షిపణులతో రష్యాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను తాము ఎదుర్కొన్నామని రష్యా ప్రకటించింది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా ఖండాతర క్షిపణిని ప్రయోగించింది. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 1000 రోజులు దాటింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రష్యాకు సహకరించేందుకు ఉత్తర కొరియా 10 వేల మందికి పైగా సైనికులను పంపించిందని అమెరికా, దక్షిణ కొరియాలు వెల్లడించాయి.     

Also Read :  ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. అర కిలోమీటర్ స్కూటర్ ని ఈడ్చుకెళ్ళిన కారు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు