భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. దీని వెనుక ఎవరున్నారు? అదానీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..ఈ కింది ఆర్టికల్‌లో చదివేయండి. By Manogna alamuru 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 09:57 IST in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Adani grp, Green Energy: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు భారీగా లంచం ఇచ్చారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్ఈసీఐతో 12 జీడబ్ల్యూ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని ఆరోపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కేసులు పెట్టారు అదానీ గ్రూప్ మీద. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది. టార్గెట్ అదానీ? తమపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. న్యాయపరంగా ఎదుర్కొంటామని చెబుతోంది. అయితే ఇప్పుడు అర్జంటుగా బైడెన్ సర్కార్ ఎందుకు అదానీని టార్గెట్ చేసిందనేది పెద్ద ప్రశ్న. అమెరికాలో ఎన్నికలు జరిగిపోయాయి. ట్రంప్ భారీ విజయం సాధించారు. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 20 తరువాత ట్రంప్ ప్రభుత్వం వస్తుంది. అయితే అది అవడానికి ఇంకా దాదాపు రెండు నెలలు టైమ్ ఉంది. ఈలోపు ట్రంప్, అతని మద్దతుదారులను బైడెన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు అర్జంటుగా అదానీ మీద కేసులు పెట్టడం చూస్తే లాగే అనిపిస్తోంది అంటున్నారు ఓ వర్గానికి చెందిన వారు, అదానీ సపోర్టర్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఆ సందర్భంలో అదానీ కొత్త అధ్యక్షుడకి మద్దుతుగా నిలిచారు. అలాగే ట్రంప్ గెలిచినప్పుడు విషెస్ చెబుతూ పోస్ట్ కూడా పెట్టారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని డెమోక్రాట్లు, డెమోక్రాట్ లాబీయిస్టుల మద్దతుతో చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అవి యునైటెడ్ స్టేట్స్ ఇన్‌ఫ్రా అండ్ ఎనర్జీ ప్రాజెక్టులో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతాయని హామీ ఇచ్చాయి. అయితే ట్రంప్ దీనికి వ్యతిరేకం అనే అనుమానాలున్నాయి. రంప్ వస్తే చైనాకు అడ్డుకట్ట వేస్తారు. అందులో ఆయన అదానీని ఉపయోగించుకోవచ్చనే వాదన ఉంది. ఇప్పటికే చైనా వాణిజ్య దురాక్రమణను ఎదుర్కోవడానికి అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదానీ కొలంబోలో ఒక ఓడరేవును, ఇజ్రాయెల్ హైఫాలో, టాంజానియాల్లో ఓడ రేవుల్ని నిర్మిస్తున్నారు. ఇది భౌగోళికంగా, రాజకీయంగా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్వరలో దిగిపోబోతున్న బైడెన్ ప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హిండెన్ బర్గ్ రిపోర్టులాగే తాజా ఆరోపణలు భారతీయ పారిశ్రామికవేత్తల పరువు తీయడానికే ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు అదానీపై ఆరోపణలు చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్‌కు డెమోక్రాట్ నేతలతో మంచి సంబంధాలు ఉండటం...ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. బ్రియాన్ పీస్‌కి డెమోక్రాట్ సెనెటర్ చక్ షుమర్ తో సంబంధాలున్నాయని తెలుస్తోంది. పీస్ జ్యుడీషియల్ నియామకంలో కూడా షుమెర్ పాత్ర ఉంది. Also Read: AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు! ఇండియాలో లంచాలు ఇస్తే అమెరికాలో కేసులు ఎలా? అదానీపై కేసుల విషయంలో అందరినీ ఆశ్చర్యపుస్తున్న మరో విషయం ఇది. ఆరోపణలు చేసిన అమెరికా ప్రాసిక్యూటరే స్వయంగా అదానీ గ్రూప్ ఇండియాలో రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని చెప్పారు. అదానీ గ్రూప్ మీద ఆరోపణలు చేసిన ప్రాసిక్యూటర్ పీస్ అన్ని ఆధారాలను పక్కాగా సేకరించిన తర్వాతనే ప్రొసీడ్ అయ్యారు. అదానీ కంపెనీ ఎవరెవరికి, ఎంత లంచం ఇచ్చింది అన్నది ప్రూఫ్స్‌తో సహా వారి దగ్గర ఉన్నాయి. అయితే అలాంటప్పుడు ఇండియాలో కదా కేసులు పెట్టాలి. అమెరికా వాళ్ళు ఎందుకు మధ్యలో జోక్యం చేసుకున్నారు. దీనికి ఒక కారణం ఉంది. అమెరికాలో ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ అనే చట్టం ఉంది. ఇది ఎప్పటి నుంచో అమెరికాలో ఉంది. అయితే ఈ మ్య దీన్ని మరింత కఠినతరం చేశారు. ఇంకా చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేశారు. ఇప్పుడు ఇదే అదానీ గ్రూప్ మెడకు చుట్టుకుంది. దీని ప్రకార అమెరికాఓ ఎవరైనా వ్యాపారం చేద్దాం అనుకున్ఆ, నిధులు సమీకరించుదాం అనుకున్నా వారికి క్లీన్ రికార్డ్ ఉండాలి. అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే వాళ్ళు ఏ ఆర్ధిక నేరాలకు పాల్పడలేదు అని రికార్డ్ ఉండాలి. అమెరికా నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏ కంపెనీ అయినా తమను అప్రోచ్ అయ్యాక అమెరికా చట్ట ప్రకారం ఇవన్నీ పరిశీలిస్తారు. అమెరికాలో వ్యాపారం చేసే ముందు ఈ యాక్ట్ మీద సంతకం పెట్టించుకుంటారు. అలా సంతకం చేసిన తర్వాత తప్పులు బయటపడ్డాయో కేసులు వేసేస్తారు. ఇప్పుడు అదానీ కంపెనీ విషయంలో అదే జరిగింది. Also Read: TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్! అమెరికా ఆరోపణలు చేసింది అదానీ గ్రీన్ ఎనర్జీపైన మాత్రమే...మొత్తం గ్రూప్ మీద కాదు. ఎందుకంటే అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ బాండ్ల రూపంలో అమెరికాలో 600 మిలియన్ డాలర్లు అంటే 5 వేల 600 కోట్ల రూపాయల నిధులు సేకరించే పని పెట్టుకుంది. బాండ్లు, అప్పుల రూపంగా మొత్తం 25వేల కోట్ల రూపాయల వరకు సేకరించారు. ఇంత అప్పు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా ఆదాయం కచ్చితంగా అడుగుతారు. అమెరికాలో అప్పులు ఇచ్చేందుకు రెడీ అయిన వాళ్ళు కూడా అడిగారు. అదానీ కంపెనీ మొత్తం తన వ్యాపారం, వచ్చే ఆదాయం, అందులోని లాభాల గురించి చెప్పింది. ఇండియాలో సోలార్ ఎనర్జీ ఒప్పందాలు...దానిపై వచ్చే రాబడి లెక్కలతో సహా చూపించింది. దాని ప్రకారం 20 ఏళ్లలో 16వేల 800 కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పింది. ఇంత వరకు అంతా బాగానే అయింది. లాభం బాగా వస్తుంది కాబట్టి చాలా మంది అప్పులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అమెరికన్ ఇన్వెస్టర్లతో పాటు కెనడా, ఇతర దేశాల ఇన్వెస్టర్లు కూడా నిధులు సమకూర్చిన వాళ్లలో ఉన్నారు. అది కూడా ఏకంగా 2100 కోట్ రూపాయలను లంచంగా ఇచ్చిందని తేలింది. ఇది అమెరికా కోర్టుకు తెలిసిపోయింది. అక్కడ అదానీ గ్రీన్ ఎనర్జీని పట్టుకుంది. కేసులు పెట్టింది. అయితే అదానీ గ్రూప్ భారత్‌లో పలు రాష్ట్రాలకు ఎందుకు లంచం ఇచ్చిందనేది...అదే పెద్ద కథ మళ్ళీ. అదానీ కేసును సెక్ టేకప్ చేసింది. సెక్ అంటే.. అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ కమిషన్. ఇది ఒక కేసును టేకప్ చేసి, అందులో ఫ్రాడ్ జరిగిందని గుర్తిస్తే అంత తేలికగా వదిలి పెట్టదు. పైగా అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు యాక్టింగ్ డైరెక్టర్లుగా ఇద్దరు ఇండియన్ ఇన్వెస్టిగేటర్లే ఉన్నారు. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్‌గా సంజయ్ వాద్వా ఉంటే.. కేసును పర్యవేక్షిస్తున్న వాళ్ళల్లో తేజల్ డి షా ఉన్నారు. ఇద్దరూ చాలా గట్టివాళ్ళని పేరుంది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు కేసును ముందుకు తీసకెళ్ళనివ్వరు. అలాంటిది ఇప్పుడు అదానీ కేసు ఇంత వరకు వచ్చిందంటే కచ్చితంగా తప్పు జరిగింది అనే అర్ధం అంటున్నారు. అదీకాక అమెరికాలో నిధులు సేకరించుకుని.. ఇండియాలో లంచాలు ఇచ్చి గొప్పోళ్ళు అయిపోతామంటే మేమెందుకు ఊరుకుంటామని యూఎస్ కోర్టు అంటోంది. Also Read: TS: ఎన్నికలకు సిద్ధంకండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే ఇదంతా అదానీకి తెలిసే జరిగిందా...లేదా కింది అధికారులు చేస్తే అతని తలకు చుట్టుకుందా? కింది అధికారులు చేసి దానికి అదానీకి శిక్ష వేస్తారా అని ఇండియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దీని గురించి పెద్ద సంచలన విషయమే చెప్పారు. ఏఏ రాఫ్ట్రాల్లో అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందో..అక్కడ అధికారులకు, రాజకీయనాయకులకు గౌతమ్ అదానీనే స్వయంగా వెళ్ళి లంచాలు ఇచ్చారని చెప్పారు. వీటన్నిటికి సంబంధించి పెద్ పెద్ద ప్రూఫ్ లే తమ దగ్గర ఉన్నాయని కూడా చెబుతున్నారు. లంచం వ్యవహారంలో గౌతమ్ అదానీని డైరెక్టుగా పిలవకుండా ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారనే ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ కేసులో ఎఫ్‌బీఐ కూడా వేలు పెట్టింది. ఇక ఇప్పుడు అదానీ గ్రూప్ మీద ఎంత తొందరగా ఛార్జ్ తీసుకుంటారనేది అసలు ప్రశ్న. కేసును వేగంగా కదిలించి వెంట వెంటనే యాక్షన్స్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కొన్ని మీడియాల్లో అదానీ, మరికొందరి మీద అరెట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి అని వార్తలు వచ్చాయి. అదే కనుక జరిగితే అదానీని భారత్ అమెరికాకు అప్పగిస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. లేదూ ఈ కేసు రెండు, మూడు నెలు సాగింది. ఈ లోపు ట్రంప్ ప్రభుత్వం వచ్చేసింది అంటే మొత్తం అంతా మారిపోవచ్చును. అసలే అదానీకి, ట్రంప్‌కు మంచి సంబంధాలున్నాయి. ట్రంప్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. త్వరలోనే అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని, 15వేల ఉద్యోగాలు కల్పిస్తామని ట్వీట్ చేశారు గౌతమ్ అదానీ. మరోవైపు ట్రంప్ కూడా గ్రీన్ ఎనర్జీని ఎంకరే చేస్తామని చెప్పారు. అలాంటప్పుడు అదానీపై యాక్షన్ తీసుకోవడం డౌటే. కాబట్టి అదానీపై కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Also Read: Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ముహుర్తం ఈ నెలాఖరునే! #adani-green-energy #gautam-adani #adani-group మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి