BIG BREAKING: బీజేపీ నేతపై కాల్పులు..

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కనవ్‌ శర్మపై తూపాకితో కాల్పులు జరపడం కలకలం రేపింది. వాహనం పార్కింగ్ విషయంలో గొడవ చెలరేగడంతో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

New Update
Kanav Sharma

Kanav Sharma

జమ్మూకశ్మీర్‌లో ఓ బీజేపీ నేతపై తూపాకితో కాల్పులు జరపడం కలకలం రేపింది. వాహనం పార్కింగ్ విషయంలో గొడవ చెలరేగడంతో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన ఆ బీజేపీ నేత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతకీ ఆ బీజీపీ నేత ఎవరు ? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: నేను అద్దాల మేడ కట్టుకోలేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కనవ్‌ శర్మ.. జమ్మూలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాక్టివ్‌గా ప్రచారం చేస్తున్నారు. అయితే శుక్రవారం తన ఇంటికి దగ్గర్లోని ఓ స్థలంలో తన వాహనాన్ని పార్క్ చేశాడు. దీంతో కొంతమంది వ్యక్తులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి కవవ్ శర్మ, ఆ వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. 

Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్‌ ఇండియాకు?

అయితే వారిలో ఒక తుపాకీ తీసుకొని రెండుసార్లు కాల్పులు జరిపాడు. అందులో ఒక తూటా కనవ్‌ శర్మలో శరీరంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత వాళ్లు అక్కడినుంచి పారిపోయారు. గాయాలపాలైన కనవ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడ్డ వారిలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్‌ రా బాబు!

Also read: అదనపు విధులతో ఉద్యోగాల భర్తీకి ఆలస్యం.. టీజీఎస్పీ కీలక నిర్ణయం

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు