/rtv/media/media_files/2025/02/13/GIqHHXGzyhJ1AxOgOSt1.jpg)
BJP MP Tejaswi Surya flew in HTT-40 training aircraft
Tejasvi Surya: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన HTT-40 శిక్షణ విమానం పనితీరును స్వయంగా పరీశీలించారు. 30 నిమిషాలు తేజస్వీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో జర్నీ చేశారు.
VIDEO | Aero India 2025: BJP MP Tejasvi Surya (@Tejasvi_Surya) takes a sortie in HTT-40 trainer aircraft in Bengaluru.
— Press Trust of India (@PTI_News) February 13, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/RKgcp4NZVY
Also Read: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
ఆత్మనిర్భర భారత్‌కు ప్రతీక..
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఈ విమానం ఆత్మనిర్భర భారత్‌కు ప్రతీక అని కొనియాడారు. దీనిని తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ఈ దేశానికి గర్వకారణం అన్నారు. 2012లో స్విస్ కంపెనీ నుంచి ట్రైనర్ జెట్లను కొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. కానీ దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని 2019లో CBI నిరూపించింది. దీంతో హాల్ వంటి భారత సంస్థలకు ప్రాధాన్యం లభించలేదు. దీంతో స్వదేశీ శిక్షణ విమానాల తయారీ ప్రాజెక్టుకు నష్టాన్ని కలిగిడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయినంత పనైందని ఆయన గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Maoist: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!
అయితే 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కృషితో ఈ ప్రాజెక్టు మళ్లీ మొదలైంది. రికార్డు స్థాయిలో 40 నెలల్లో హాల్, మన ఇంజినీర్లు HTT 40ని రూపొందించారు. భారీ స్కామ్ ఆరోపణల నుంచి ఆత్మనిర్భత వైపు ప్రయాణాన్ని ఇది సూచిస్తోందని ఎంపీ కొనియాడారు.
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు