/rtv/media/media_files/2025/08/18/uttar-pradesh-2025-08-18-11-28-08.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ఒక టోల్ బూత్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. సైనికుడిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నలుగురు టోల్ బూత్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికకంగా ఈ ఘటన కలకలం రేపింది. కపిల్ కవాద్ అనే ఈ ఆర్మీ జవాన్ భారత సైన్యంలోని రాజ్‌పుత్ రెజిమెంట్‌లో పనిచేస్తున్నాడు. సెలవుల కోసమని ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లడానికి ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరాడు. కానీ దారిలో భుని టోల్ బూత్ వద్ద ఊహించని ఘటన చోటుచేసుకుంది. కపిల్ అతని బంధువు రద్దీగా ఉండే భూని టోల్ బూత్ వద్ద చిక్కుకున్నారు. ఫ్లైట్ మిస్ అవుతుందేమోనని ఆందోళన చెందిన కపిల్, తన కారు నుంచి దిగి టోల్ బూత్ సిబ్బందితో మాట్లాడాడు.
In Meerut,
— Hasan khan (@Hasankh33831912) August 18, 2025
Uttar Pradesh, toll plaza employees beat up an Indian Army soldier. is hearing that there was a jam between our army staff and an argument over money. pic.twitter.com/uhchiif6iJ
వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా
అతని గ్రామం టోల్ ఫీ నుంచి మినహాయింపు పొందిన ప్రాంతంలో ఉందని చెప్పాడు. దీంతో ఈ విషయం వివాదాస్పదమైంది. చిన్న వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారింది. ఆ క్రమంలో ఐదుగురు టోల్ బూత్ సిబ్బంది కపిల్‌ని, అతని కజిన్‌ని కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ (గ్రామీణ) రాకేష్ కుమార్ మిశ్రా తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను స్కాన్ చేసిన తర్వాత నలుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. మిగతా నిందితులను అరెస్టు చేయడానికి మరో రెండు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టే సైనికుడికి ఇలాంటి అవమానం జరగడం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. . ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Udaya Bhanu : రెమ్యూనరేషన్ అడిగితే బ్యాడ్ గా ప్రచారం చేశారు.. ఉదయభాను సంచలన కామెంట్స్