/rtv/media/media_files/2025/11/15/pm-modi-2025-11-15-21-12-00.jpg)
Bihar rejected casteist agenda of Oppinino, Says PM Modi
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. కులతత్వ విషాన్ని చిమ్మే వాళ్లను, ముస్లిం లీగ్ మావోయిస్టు భావాజాలం ఉన్నవాళ్లను బీహార్ ప్రజలు తిరస్కరించారని ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని సూరత్‌లో స్థిరపడిన బీహారీలు శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: బీహార్ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు
''10 ఏళ్లుగా వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో పనిచేసిన ఆ పార్టీ నేత (రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ) చేసిన విన్యాసాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కనీసం మిత్రపక్షాలకు, కార్యకర్తలకు కూడా అపజయం గురించి కాంగ్రెస్ వివరించే పరిస్థితిలో లేదు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లని ప్రజలు తిరస్కరించారు.
Also Read: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. లాలూ యాదవ్ కూతురు సంచలన నిర్ణయం
దీన్ని బీహార్ ఫలితాలే మరోసారి రుజువు చేశాయి. దళితులు ఎక్కువగా ఉన్న 38 స్థానాల్లో 34 స్థానాల్లో NDA గెలిచింది. దళితులు కూడా కాంగ్రెస్‌ను తిరస్కరించారని'' ప్రధాని మోదీ అన్నారు. ఇదిలాఉండగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 202 స్థానాల్లో విజయం సాధించింది. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం కేవలం 34 సీట్లకే పరమితమైంది. అందులో ఆర్జేడీ 25 స్థానాల్లో గెలిచింది. అయితే బీహార్‌లో ఈసారి సీఎం ఎవరూ అనేదానిపై ఆసక్తి నెలకొంది. మళ్లీ నితీశ్‌కుమార్‌కే బాధ్యతలు అప్పగిస్తారా ? లేదా వేరే నేతకు ఈసారి ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Speaking in Surat. Watch. https://t.co/chw5JEn0Kj
— Narendra Modi (@narendramodi) November 15, 2025
Follow Us