/rtv/media/media_files/2025/11/15/rjd-gets-more-votes-than-bjp-2025-11-15-18-41-01.jpg)
Tejashwi Yadav's RJD Gets More Votes Than BJP, JDU Despite Massive Setback In Bihar Polls
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 స్థానాల్లోనే గెలిచింది. అయితే తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఓట్లు ఎక్కవగా వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 89 సీట్లు, జేడీయూకి 85, లోక్‌జనశక్తి పార్టీ 19, హిందుస్తానీ అవామ్ మోర్చా 5 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాల్లో విజయం సాధించాయి.
Also Read: దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ పార్టీ...చిందేసిన బాలీవుడ్ తారలు?
మహాగఠ్‌బంధన్ కూటమిలో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 25 సీట్లలోనే గెలిచింది. కాంగ్రెస్ 61 స్థానాల నుంచి బరిలోకి దిగి ఆరు స్థానాలకే పరిమితమైంది. సీపీఐ(ML) 2, సీపీఐ(M) ఒక్క స్థానంలో గెలిచింది. మొత్తంగా ఈ విపక్ష కూటమి 35 స్థానాల్లోనే గెలిచింది. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
Also Read: నితీశ్‌తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బీజేపీ కన్నా ఆర్జేడీకే ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి 23.11 శాతం ఓట్లు రాగా.. ఈసారి ఎన్నికల్లో 23 శాతం ఓట్లు వచ్చాయి. బీజీపీకి 2020 ఎన్నికల్లో 19.46 శాతం ఓట్లు రాగా.. ఈసారి 20.07 శాతం వచ్చాయి. జేడీయూకి 19.25 శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ బీజేపీ, జేడీయూ కన్నా ఎక్కువ శాతం ఓట్లు సాధించింది.
Follow Us