Bihar Elections : ప్రశాంతంగా బిహార్‌ మొదటి దశ పోలింగ్..ఓటేసిన నితీష్

బిహార్‌ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.

New Update
nitish

బిహార్‌ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 27 శాతం పోలింగ్ నమోదైంది. 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటు వేశారు.  

భక్తియార్‌పూర్‌లోని మంజు సిన్హా ప్రాజెక్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఓటు వేశారు. తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఓటు వేశారుజ  చౌదరి దాదాపు దశాబ్దం తర్వాత బీజేపీ టికెట్‌పై తారాపూర్ నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

14 స్థానాల్లో CPI-ML అభ్యర్థులు

ఇక ఈ ఎన్నికల్లో 57 స్థానాల్లో JDU, 48 స్థానాల్లో బీజేపీ, 14 స్థానాల్లో LJP పోటీ చేస్తుంది.  8 స్థానాల్లో లోక్‌మోర్చా బరిలో నిలిచింది. మరోవైపు 73 స్థానాల్లో RJD, 24 స్థానాల్లో కాంగ్రెస్,  14 స్థానాల్లో CPI-ML అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ నుంచి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు