/rtv/media/media_files/2025/08/01/anil-ambani-2025-08-01-19-18-36.jpg)
Anil Ambani
దిగ్గజ వ్యాపారవేత్త,రిలయన్స్ గ్రూప్(Reliance Groups) అధినేత అనిల్ అంబానీ(anil-ambani) కి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన నివాసాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీ ఆసీసుల్లో, నివాసాల్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రిలయన్స్ ఇన్ ఫ్రా తో పాటు అనిల్ కు చెందిన పలు ఇతర కంపెనీలలో CBI Raids కొనసాగుతున్నాయి. అనిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వార బ్యాంకును మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఆర్‌కామ్ ప్రమోటర్ కూడా అయిన డైరెక్టర్ అనిల్ అంబానీకి సంబంధించిన అన్ని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : ఆపరేషన్ తర్వాత పాక్ 138 శౌర్య పతకాల అవార్డుల ప్రకటన.. రాహుల్ గాంధీకి ఈ సాక్ష్యం చాలా? ఇంకా కావాలా?
CBI Raids Anil Ambani Residences
అనిల్ గ్రూప్‌కు చెందిన కంపెనీలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఇదివరకే ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఈడీ ఆయనను10 గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పుడు సీబీఐ కూడా ఎంటర్ కావడంతో అనిల్ అంబానీని సమస్యలు చుట్టుముడుతున్నట్లయింది. కొద్ది రోజుల నుంచి ఇదే కేసుకు సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ అంబానీ మొత్తం రూ. 17 వేల కోట్ల విలువైనబ్యాంక్ లోన్ ఫ్రాడ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి అంతకుముందే అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో అనేకసార్లు తనీఖీలు నిర్వహించిందిఈడీ. అనంతరం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే.. ఆగస్ట్ 5న ఈడీ అనిల్ అంబానీని సుమారు 10 గంటల పాటు విచారించింది కూడా. పీఎంఎల్ఏ కింద ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేసింది.
జులై 24న ఈ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన దాదాపు 50 కంపెనీల్లో, సుమారు 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపైనా ఈడీ(ED) పెద్ద ఎత్తున సోదాలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అంబానీ సహా రిలయన్స్ గ్రూప్‌కు చెందిన పలువురు సీనయిర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈ సందర్భంగా సమన్లు జారీ చేసింది ఈడీ. ఇదే సమయంలో అనిల్ అంబానీని విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందజేసింది. అంతేకాక మరుసటి రోజే ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది.
మొత్తం రూ. 17 వేల కోట్ల రుణాల్లో.. రిలయన్స్ హోం ఫైనాన్స్ రూ. 5900 కోట్లకుపైగా; రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ సుమారు రూ. 8200 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 4100 కోట్లకుపైగా ఉన్నాయి. కొందరు బ్యాంక్ అధికారులకు లంచం ఇచ్చి వీటిని బ్యాంకుల నుంచి అక్రమమార్గంలో ఇతర షెల్ కంపెనీలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఈడీ నోటీసులు, విచారణ నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా పలు కంపెనీల స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి. గతంలో మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లోనూ అంబానీ ఈడీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. మరోవైపు అనారోగ్యం కారణంగా ఆయన తల్లి కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఈ రైడ్స్ జరగడం గమనార్హం.
ఇది కూడా చూడండి:ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా