/rtv/media/media_files/2025/09/30/bomb-threats-to-foreign-embassies-2025-09-30-16-53-07.jpg)
Bomb threats to foreign embassies
Bomb Threat Call : చెన్నైలో గత కొంతకాలంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, రాజకీయ పార్టీ నాయకులకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్యే చెన్నైలోని రాజ్ భవన్, సెక్రటేరియట్ లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇదిలా ఉండగానే మరోసారి బాంబు బెదిరింపులు చోటుచేసుకోవడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న పలు దేశాలకు చెందిన ఎంబసీలకు సంబంధించిన కాన్సులేట్ జనరల్, హానరరీ కాన్సులేటు కార్యాలయాలకు ఈ రోజు గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తం 9 ఎంబసీ కార్యాలయాల్లో బాంబులు పెట్టామని, కాసేపట్లో భారీ పేలుడు సంభవించబోతున్నట్లుగా ఆగంతకుడు పోన్ చేసి చెప్పడం కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?
దీంతో అప్రమత్తమైన చెన్నై పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో ఆయా కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ వచ్చిన ఎంబసీలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, జపాన్ కాన్సులేట్ జనరల్, హనరరీ కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తూనే ప్రజలను భయపడవద్దని, అనవసర ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని కోరుతున్నారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్-100కు వెంటనే కాల్ చెప్పాలని పోలీసులు సూచించారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయా కాన్సులేట్ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ బతుకమ్మ వేడుకల్లో విషాదం.. షాక్‌తో స్పాట్లో ముగ్గురు..!
స్థాలిన్, విజయ్‌కి బెదిరింపులు
కాగా ఈ బెదిరింపులకు ఒక రోజు ముందే డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి సైతం బెదిరింపులు వచ్చాయి. స్టాలిన్ ఇంటి వద్ద బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టాలిన్ నివాసంతో పాటు కార్యాయలంలో తనిఖీలు చేపట్టి బాంబు లేదని తేల్చారు. బాంబు బెదింపుల నేపథ్యంలో స్టాలిన్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. ఇక తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్, తమిళ నటుడు విజయ్ ఇంటికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ నివాసం వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు.ఈ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు బాంబు నిర్వీర్య దళాన్ని మోహరించారు. నిపుణులు ఆయన నివాస ప్రాంగణం లోపల, వెలుపల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విజయ్ నివాసం వెలుపల భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!