Bigg Boss Telugu Promo: బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా సుమన్ శెట్టి, రీతూ మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఆ తర్వాత రాము రాథోడ్ వర్సెస్ సంజన నామినేషన్ మొదలైంది. 'హౌజ్ లో జరిగిన ప్రతి గొడవలో మీరున్నారు' అంటూ సంజనను నామినేట్ చేశాడు రామ్. దీంతో సంజన రగిలిపోయింది.. రాముతో మాటల యుద్దానికి దిగింది. ''నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో.. కానీ మాట్లాడడం నేర్చుకో'' అంటూ తన నోటి దురుసును ప్రదర్శించింది. దీంతో రాము కూడా రెచ్చిపోయాడు! జాగ్రత్తగా మాట్లాడండి అంటూ సంజన పై ఫైర్ అయ్యాడు. ఇక రాముకి సపోర్ట్ గా సుమన్ శెట్టి కూడా వచ్చాడు. రాముని అలా అనడం తప్పని వాదించాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్టు ఏంటంటే.. రాము, సుమన్ నామినేట్ చేసిన సంజన, రీతూలో ఎవరు నామినేషన్ లోకి వెళ్ళాలి అనేది కెప్టెన్ పవన్ డిసైడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఈరోజు నామినేషన్స్ లో పవన్ గేమ్ ఛేంజర్ కాబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
Also Read: Cinema: అయ్యో.. మహేష్ నో చెప్పాడు.. బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు! ఆ సినిమా ఏంటో తెలుసా?
సెకండ్ టైం కెప్టెన్..
సీజన్ మొదలైన మూడు వారాల్లో రెండు సార్లు కెప్టెన్ గా గెలిచి ఆటగాడు అనిపించుకున్నాడు డెమోన్ పవన్. అయితే రెండవ వారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. కానీ వీకెండ్ ఎపిసోడ్ లో సంజన ఇంట్లోకి రావడానికి తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. దీంతో బిగ్ బాస్ మరోసారి కెప్టెన్సీ టాస్క్ పెట్టగా.. అందులో డెమోన్ పవన్ గెలిచి రెండోసారి బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో డెమోన్ సైలెంట్ గా ఉంటూనే.. సమయం వచ్చినప్పుడుడల్లా ఆటలో తన కండబలాన్ని, బుద్ది బలాన్ని ప్రదర్శిస్తున్నాడు. టాస్కులతో, ఇంటి పనుల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ప్రేక్షకుల్లో తనపై మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడప్పుడూ రీతూతో లవ్ ట్రాక్ నడిపిస్తూ బిగ్ బాస్ కు మంచి కంటెంట్ కూడా ఇస్తున్నాడు డెమోన్.
ఇదిలా ఉంటే.. ఈ వారం శ్రీజ, సంజన, దివ్య నిఖిత, తనూజ, హరిత హరీష్, రీతూ, ఫ్లోరా నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రేక్షకుల అభిప్రాయం. బిగ్ బాస్ లో ఏం ఆడకపోయినా.. మొదటి వారం నుంచి లక్కీగా సేవ్ అవుతూ వస్తోంది ఫ్లోరా. కానీ, ఈ వారం నామినేషన్స్ లో అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండడంతో ఫ్లోరా తప్పించుకోవడం కష్టమే అని టాక్.
Also Read: The RajaSaab Trailer: మొత్తం పోతారు.. రాజాసాబ్ ట్రైలర్ అరాచకం అంతే! మూడు నిమిషాలు రచ్చ రంబోలా