/rtv/media/media_files/2025/07/15/rape-2025-07-15-18-25-54.jpg)
Bengaluru Student Raped By Physics, Biology Lecturers And Their Friend
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే వారినే గురువులు అంటాం. కానీ వాళ్లే మృగాళ్ల ప్రవర్తించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇద్దరు లెక్చరర్లు ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఆ కాలేజీలో పనిచేసే వాళ్ల స్నేహితుడు కూడా ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో నరేంద్ర అనే వ్యక్తి ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
Also Read: సోషల్ మీడియా పోస్టులపై సుప్రీం కీలక ఆదేశాలు..ఇక దబిడి దిబిడే...
Also Read : యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
Bengaluru Student Rape Case
సందీప్ అనే వ్యక్తి బయాలజీ లెక్చరర్‌గా, అనూప్ అనే మరోవ్యక్తి నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఆ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యర్థినితో లెక్చరర్ నరేంద్ర అకడమిక్ నోట్స్ షేరింగ్ పేరుతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అనూప్ ఇంటికి పిలిపించుకుని ఆ విద్యార్థినిని రేప్ చేశాడు. ఈ విషయం మరో లెక్చరర్ సందీప్‌కు కూడా తెలిసింది. దీంతో ఈ విషయం బయటపెడతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి.. సందీప్ కూడా అత్యాచారం చేశాడు.
Also Read: భూమిపైకి శుభాంశు శుక్లా.. అంతరిక్షంలో 60 రకాల ప్రయోగాలు
ఆ తర్వాత వాళ్లిద్దరిని కలిసేందుకు తన రూమ్‌కు ఆమె వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉందని అనూప్ కూడా బ్లాక్‌మెయిల్ చేశాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ముగ్గురూ కూడా ఆమెను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇక చివరికి ఆ విద్యార్థిని కలిసేందుకు ఆమె తల్లిదండ్రులు కాలేజీకి వచ్చారు. దీంతో ఆమె జరిగిన విషయం వాళ్లకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
Also Read : బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు!
rape | bengaluru | crime | rtv-news | telugu-news