Dog Disease: శునకాలకు వింత వ్యాధి.. ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్న వైద్యులు..
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శునకాలకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిలో దగ్గులు, తుమ్ములు, నీరసం, న్యూమోనియా వంటి లక్షణాలున్నాయి. అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి వైద్య నిపుణులు అనారోగ్యానికి గురైన శునకాల నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు.