Viral Video: యజమాని అత్యుత్సాహం .. పాపం.. రైలు కింద పడిన కుక్క!.. వీడియో వైరల్
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కుక్క రైలు, ప్లాట్ ఫార్మ్ మధ్యలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.