/rtv/media/media_files/2025/10/29/november-new-rules-2025-10-29-11-20-57.jpg)
November New rules
నవంబర్ 1వ తేదీ నుంచి ముఖ్యమైన కొన్ని రూల్స్ మారనున్నాయి. ఆధార్ కార్డు నుంచి క్రెడిట్ కార్డులు, గ్యాస్ ధరలు, మ్యూచువల్స్ ఫండ్స్ అన్ని రూల్స్ కూడా మారతాయి. అయితే మారనున్న ఆ రూల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Stock Market: కొత్త పెట్టుబడులకు అవకాశాలు..ఐపీవోలను ప్రారంభించిన 5 కొత్త కంపెనీలు
ఆధార్ కార్డు
UIDAI కొత్త వ్యవస్థ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆన్‌లైన్‌లోనే పేరు, చిరునామా, పుట్టిన తేదీ మొదలైన సమాచారాన్ని నేరుగా మార్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ లేదా కంటి స్కాన్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ పత్రాలను అప్‌లోడ్ చేయడంలో ఉన్న ఇబ్బంది ఇకపై ఉండదు.
SBI క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో మార్పు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొత్త నియమాలను ప్రకటించింది. నవంబర్ 1 నుండి అన్‌సెక్యూర్డ్ కార్డులకు 3.75% ఛార్జీలు వసూలు చేస్తుంది. CRED, CheQ లేదా Mobikwik వంటి యాప్‌ల ద్వారా పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లిస్తే 1% అదనపు ఛార్జీ వర్తిస్తుంది. అదే పాఠశాల అధికారిక వెబ్‌సైట్ లేదా POS మెషిన్ ద్వారా చెల్లిస్తే ఎటువంటి ఛార్జీ ఉండదు. మీ వాలెట్‌లో రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేస్తే 1శాతం ఛార్జీ వసూలు చేస్తారు. అదే మీరు కార్డ్, చెక్ ద్వారా చెల్లిస్తే రూ.200 ఛార్జీ విధిస్తారు.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త నియమాలను అమలు చేసింది. ఇప్పటి నుంచి రూ.15 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే ఏ AMC (ఆస్తి నిర్వహణ కంపెనీ) అధికారి, ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యుడు అయినా దానిని కంపెనీ కంప్లైయన్స్ ఆఫీసర్‌కు నివేదించాలి. 'ఇన్‌సైడర్ ట్రేడింగ్'ను నిరోధించడం లక్ష్యంగా ఈ రూల్‌ను తీసుకొచ్చారు.
లాకర్ నామినీ నియమాలలో మార్పు
నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రధాన మార్పులు అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఒక ఖాతా లేదా లాకర్ కోసం ఒక నామినీని మాత్రమే ఇవ్వగలిగేది. కానీ ఇప్పటి నుంచి కస్టమర్లు ఒకే ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి నామినీకి ఎంత శాతం ఇవ్వాలో ఖాతాదారులు నిర్ణయించుకోవచ్చు. మొదటి నామినీ మరణించిన సందర్భంలో ఆ హక్కు తదుపరి నామినీకి బదిలీ అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
LPG, CNG, PNG ధరలలో మార్పు
ప్రతి నెల మాదిరిగానే నవంబర్ 1న, LPG, CNG, PNG ధరలు మారుతుంటాయి. చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా వీటిని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈసారి ధరల పెరుగుదల లేదా ధర తగ్గుదల రెండూ జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: Best Business Idea: తక్కువ పెట్టుబడితో నెలకు ఈజీగా రూ.30 వేలు.. అదిరిపోయే బిజినెస్ ఐడియా అంటే ఇదే గురూ!
Follow Us