/rtv/media/media_files/2025/11/28/delhi-2025-11-28-10-21-30.jpg)
Delhi: ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ 400 కు వచ్చేసింది. ప్రతీ ఏడాది ఇది 300 దగ్గర ఆగిపోయేది. కానీ ఈ సారి దాన్ని దాటుకుని వచ్చేసి AQI 404 కు దిగజారిపోయేది. దీన్ని అత్యంత తీవ్ర పరిస్థితిగా పరిగణిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం 8:00 గంటలకు ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) 384కి చేరుకుంది. ముండ్కా నగరంలో అత్యధిక కాలుష్య స్థాయిని 436గా నమోదుచేసింది, ఆ తర్వాత రోహిణి 432గా ఉంది. ఆనంద్ విహార్ (408) మరియు జహంగీర్‌పురి (420) కూడా 'తీవ్రమైన' శ్రేణిలోనే ఉన్నాయి. ఇది దారుణమైన పరిస్థితి అని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అంటోంది.
Also Read: మావోయిస్టుల సంచలన ప్రకటన..జనవరి 1న సామూహికంగా లొంగిపోతాం
ఢిల్లీలోని 39 స్టేషన్లలో 19 స్టేషన్లు AQI 400 కంటే ఎక్కువ..
ఢిల్లీకి పక్కనే ఉన్న నగరాలు కూడా ఎయిర్ పొల్యూషన్ తో బాధపడుతున్నాయి. నోయిడాలోAQI 404గా నమోదైంది. అలాగే గ్రేటర్ నోయిడా మరియు ఘజియాబాద్‌లలోAQI వరుసగా 377, 350గా 'చాలా పేలవమైన' గాలి నాణ్యత నమోదైంది. CPCB ప్రకారం, ఢిల్లీలోని 39 స్టేషన్లలో 19 స్టేషన్లు ఉదయం 8:00 గంటలకు 400 కంటే ఎక్కువ AQIని చూపించాయి. పంజాబీ బాగ్‌లో 417, RK పురంలో 418, వజీర్‌పూర్‌లో 416, నరేలాలో 407 AQI నమోదైంది. చాందినీ చౌక్ (408), జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (401), బురారీ క్రాసింగ్ (403) వంటి ఇతర ప్రముఖ ప్రాంతాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. గురువారం అంతా ఢిల్లీ దట్టమైన పొగ మంచులో కూరుకుపోయింది. నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఢిల్లీ, దాని పక్కన నగరాలను చలిగాలులుపట్టిపీడిస్తున్నాయి. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు దానికి తోడు అధిక కాలుష్య స్థాయిలకలయిక ప్రజారోగ్య పరిస్థితులను మరింత క్షీణింపజేస్తున్నాయి.
Also Raed: చిరంజీవిని కీర్తి సురేష్ అంత మాట అనేసిందా..? అసలేమైందంటే..!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్మెటియోరాలజీ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ డేటా ప్రకారం గురువారం ఢిల్లీలో కాలుష్యానికి వాహన ఉద్గారాలు 19.5 శాతంగా ఉన్నాయి. ఘజియాబాద్ 8.2 శాతం, బాగ్‌పత్ 7.3 శాతం, పంట వ్యర్థాల దహనం 0.7 శాతంగా ఉన్నాయి. దీంతో ఢిల్లీలో ఆఫీసులన్నీ వర్క్ హోమ్ ను ప్రకటించాయి. స్కూల్స్ అయితే దాదాపు నెల రోజు లనుంచే ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి.
Follow Us