Bengaluru Crime News: సాఫ్ట్‌వేర్ అంటూ మోసం చేసిన పానీపూరీ భర్త.. గర్భవతి అని చూడకుండా దారుణంగా ఏం చేశాడంటే?

బెంగళూరులో వరకట్న వేధింపుల కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. ఎం.టెక్ గ్రాడ్యుయేట్ అని చెప్పి రూ.40 లక్షల కట్నం తీసుకున్న భర్త ప్రవీణ్ పానీపూరీ అమ్ముతున్నాడు. అత్తింటి చిత్రహింసలు భరించలేక గర్భవతి అయిన శిల్ప ఇంట్లోనే ఉరేసుకుంది.

New Update
Bengaluru software

Bengaluru software

నేటి కాలంలో మహిళలపై వరకట్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అడిగినంత కట్నం ఇచ్చి తల్లిదండ్రులు గ్రాండ్‌గా పెళ్లి చేసిన కొందరు భర్తలు మాత్రం భార్యలను వేధిస్తున్నారు. భర్త వరకట్న వేధింపులు, అత్త వారి చిత్రహింసలు భరించలేక ఎందరో భార్యలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన శిల్ప (27) అనే యువతి అత్తింటి వారి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే శిల్పకు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రవీణ్ అనే యువకుడితో వివాహమైంది.

ఇది కూడా చూడండి: UP Crime: మనువడిని పార్ట్‌లుగా నరికి బలిచ్చిన తాత.. తాంత్రికుడు మాటలు నమ్మి దారుణంగా..!

ఎంటెక్ గ్రాడ్యూయేట్ అని చెప్పి పానీ పూరీ అమ్ముతున్న భర్త..

ఈ వివాహం కోసం శిల్ప తల్లిదండ్రులు సుమారుగా రూ. 40 లక్షలు ఖర్చు చేశారు. వారికి ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న పాప కూడా ఉంది. మళ్లీ శిల్ప ప్రస్తుతం గర్భవతి. శిల్పకు పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు భర్త ప్రవీణ్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం నిరంతరం వేధించడం ప్రారంభించారు. అంతేకాకుండా ప్రవీణ్ తాను M.Tech గ్రాడ్యుయేట్ అని చెప్పి శిల్పను పెళ్లి చేసుకున్నాడు.  కానీ ప్రవీణ్ అసలు ఎం.టెక్ చేయలేదు. పానీపూరీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత శిల్ప మరింత మానసిక వేదనకు గురైంది. దీనికి తోడు ప్రవీణ్, అతని తల్లిదండ్రులు తరచూ శిల్పను శారీరకంగా, మానసికంగా హింసించేవారు.

వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య..

నిజాయితీ లేని భర్త, తరచుగా వేధింపులతో శిల్ప తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోలేదని అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని శిల్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం ఆమెను చంపి, ఉరి వేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో శిల్ప కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్, అతని తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

ఇది కూడా చూడండి: SIRICILLA: నా చావుకు ఆ ముగ్గురే కారణం.. కంటతడి పెట్టిస్తున్న మైనర్ బాలిక సూ**సైడ్ లేఖ

Advertisment
తాజా కథనాలు